News July 9, 2025
పెద్దపల్లి: గానుగ వృత్తి పరిరక్షణకు ప్రభుత్వం కృషి: మంత్రి

తెలంగాణ కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గడ్డం వివేక్‌ను గానుగ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డా.లెక్కల నాగేశ్ ఈరోజు పెద్దపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. గానుగ వృత్తి పరిరక్షణ, గాండ్ల యువతకు నైపుణ్య శిక్షణ, సబ్సిడీతో గానుగలు, గాండ్ల కార్పొరేషన్ ఏర్పాటుపై వినతిపత్రం అందించారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ కుల వృత్తుల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
Similar News
News July 11, 2025
KMR జిల్లాలో పలుచోట్ల వర్షపాతం నమోదు

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. పలుచోట్ల వర్షపాతం కురవగా, జిల్లాలో వాతావరణం సాధారణ స్థితికి చేరుకున్నది. జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు మద్నూర్ మండలం సోమూరు లో 3.8మి.మీ, డోంగ్లి 1.5మి.మీ, పల్వంచ మండలం ఇసాయిపేటలో 0.8మి.మీ, నస్రుల్లాబాద్ 0.5మి.మీ లుగా నమోదయింది.
News July 11, 2025
విజయవాడ: యజమానిని చంపి పనిమనిషి పరార్

విజయవాడలో శుక్రవారం తెల్లవారు జామున దారుణం చోటు చేసుకుంది. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని NTR కాలనీలో వెంకట రామారావు (70) తన తల్లి సరస్వతితో కలిసి నివాసం ఉంటున్నాడు. తల్లిని చూసుకునేందుకు 3 రోజుల క్రితం అనూష అనే పని మనిషిని పెట్టుకున్నారు. ఆమె కూడా వారితో కలిసి అక్కడే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంటి యజమానిని హతమార్చి ఇంటిలో ఉన్న బంగారంతో పారిపోయిందని పోలీసులు తెలిపారు.
News July 11, 2025
GNT: చంద్రబాబు, లోకేశ్‌పై అంబటి ట్వీట్

వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కి చురకలంటించారు. ‘తల్లికి వందనం’ లోకేశ్ ఆలోచన. ‘ఉచిత విద్యుత్’ బాబు ఆలోచన అని చెప్తూ అమాయకపు ప్రజల్లారా నమ్మండి.!’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా అంబటి మెసేజ్‌పై టీడీపీ, వైసీపీ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పరస్పరం మాటల యుద్దం జరుగుతుంది.