News July 9, 2025

NZB: రైతుల్లో చిగురించిన ఆశలు..!

image

NZB జిల్లాలో కొన్ని రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో కొంతమంది రైతులు వరినాట్లు వేసుకోగా.. మరికొందరు నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో గతేడాది 4,36,101.21 ఎకరాల్లో వరి పండించగా ఈ ఏడాది 4,37,135 ఎకరాల్లో పండించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే నేటి వరకు 2,37,372 ఎకరాల్లో (58%) నాట్లు వేసినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.

Similar News

News September 11, 2025

నిజామాబాద్‌లో ఉద్యోగ మేళా

image

నిజామాబాద్ జిల్లా నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 12న ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి మధుసూధన్‌రావు తెలిపారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, సేల్స్ మేనేజర్ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. అభ్యర్థులు ధ్రువ పత్రాలతో ఉపాధి కార్యాలయంలో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 6305743423, 9948748428 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

News September 10, 2025

NZB: GGHలో వైద్య విభాగాలను తనిఖీ చేసిన DMHO

image

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లో కొనసాగుతున్న వైద్య ఆరోగ్య శాఖకు చెందిన వివిధ వైద్య విభాగాలను DMHO డాక్టర్ బి.రాజశ్రీ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షయ నియంత్రణ, రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమ విభాగం, న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ కేంద్రాన్ని, SNCU విభాగాన్ని పరిశీలించారు. సిబ్బంది పనితీరును హాజరు పట్టికలను వివిధ రికార్డులను పరిశీలించి సూచనలు చేశారు.

News September 10, 2025

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి: NZB కలెక్టర్

image

నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుపై సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. నిర్మాణాలకు ముందుకు రాని వారి స్థానంలో అర్హులైన కొత్త లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశామన్నారు.