News July 9, 2025

రేపు తల్లిదండ్రులు ఆడే ఆటలు ఇవే..

image

జిల్లా విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ వెట్రి సెల్వి బుధవారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న 1,810 ప్రభుత్వ, 558 ప్రైవేటు స్కూల్స్, 140 జూనియర్ కాలేజీల విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు మెగా PTM జరుగుతుందన్నారు. వక్తృత్వ, వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించాలన్నారు. తల్లిదండ్రులకు లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్, టగ్ ఆఫ్ వార్ వంటి పోటీలు ఉంటాయన్నారు.

Similar News

News July 10, 2025

సంగారెడ్డి: నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

image

నిరుద్యోగ ఎంబీసీ యువతీ, యువకులు వృత్తి నైపుణ్య శిక్షణ కోసం ఈ నెల 12లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీశ్ బుధవారం తెలిపారు. దరఖాస్తులను https://tgobmms.cgg.gov.inలో సమర్పించాలని పేర్కొన్నారు. సంబంధిత పత్రాలను డౌన్లోడ్ చేసి 14లోపు జిల్లా బీసీ అభివృద్ధి కార్యాలయంలో ఇవ్వాలన్నారు.

News July 10, 2025

మెదక్: యాప్‌లో వివరాలు నమోదు చేయాలి: డీఈవో

image

మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌లో నమోదు చేయాలని డీఈవో రాధా కిషన్ తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థులకు అందించిన పుస్తకాలు, యూనిఫామ్ వివరాలను యాప్‌లో నమోదు చేయాలన్నారు. నిర్లక్ష్యం వహించే ప్రధానోపాధ్యాయులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు.

News July 10, 2025

అనుపమ చిత్రంపై వెనక్కి తగ్గిన సెన్సార్ బోర్డు

image

అనుపమ, సురేశ్ గోపి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే జానకిvs స్టేట్ ఆఫ్ కేరళ. ఈ మూవీకి సెన్సార్ బోర్డు హీరోయిన్ పేరు మార్పు సహా 96 కట్స్ చెప్పింది. దీనిపై నిర్మాతలు కోర్టుకెళ్లగా సెన్సార్ బోర్డు వెనక్కి తగ్గింది. కేవలం రెండే మార్పులు చెప్పింది. మూవీ పేరును వి.జానకిvs స్టేట్ ఆఫ్ కేరళగా మార్చాలని, కోర్టు సీన్‌లో ఒకచోట హీరోయిన్ పేరు మ్యూట్ చేయాలంది. మూవీ టీమ్ అభిప్రాయం తెలియజేయాలని కోర్టు కోరింది.