News July 9, 2025
నిమిష మరణ శిక్ష రద్దుకు చివరి మార్గమిదే..

హత్య కేసులో కేరళ నర్సు <<16996463>>నిమిషకు<<>> యెమెన్ ఈనెల 16న మరణశిక్ష అమలు చేయనుంది. ఆమెకు శిక్ష తప్పాలంటే మృతుడి కుటుంబసభ్యులు క్షమాభిక్ష పెట్టడమే చివరి మార్గం. ఇందుకు 2020 నుంచి మానవ హక్కుల యాక్టివిస్ట్ జెరోమ్ ప్రయత్నిస్తున్నారు. వారికి $1 మిలియన్ పరిహారం, మృతుడి సోదరుడికి UAE లేదా సౌదీలో శాశ్వత నివాసం వంటి ఆఫర్లిచ్చారు. భారత ప్రభుత్వం సహకరిస్తోందని, లేదంటే ఇప్పటికే మరణశిక్ష అమలయ్యేదని జెరోమ్ తెలిపారు.
Similar News
News July 10, 2025
చరిత్ర సృష్టించారు.. ఇంగ్లండ్‌పై తొలి టీ20 సిరీస్ కైవసం

ఇంగ్లండ్ ఉమెన్-టీమిండియా ఉమెన్ మధ్య జరిగిన నాలుగో టీ20లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ని ఇంకో మ్యాచ్ ఉండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. 127 పరుగుల లక్ష్యాన్ని 3 ఓవర్లు మిగిలుండగానే ఛేదించారు. ఇంగ్లండ్ ఉమెన్‌పై మనకు ఇదే తొలి సిరీస్ విజయం. ఇరు దేశాల మధ్య 6 ద్వైపాక్షిక సిరీస్లు జరగ్గా.. అన్నింటినీ ఇంగ్లండే గెలిచింది. రాధ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.
News July 10, 2025
అనుపమ చిత్రంపై వెనక్కి తగ్గిన సెన్సార్ బోర్డు

అనుపమ, సురేశ్ గోపి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే జానకిvs స్టేట్ ఆఫ్ కేరళ. ఈ మూవీకి సెన్సార్ బోర్డు హీరోయిన్ పేరు మార్పు సహా 96 కట్స్ చెప్పింది. దీనిపై నిర్మాతలు కోర్టుకెళ్లగా సెన్సార్ బోర్డు వెనక్కి తగ్గింది. కేవలం రెండే మార్పులు చెప్పింది. మూవీ పేరును వి.జానకిvs స్టేట్ ఆఫ్ కేరళగా మార్చాలని, కోర్టు సీన్‌లో ఒకచోట హీరోయిన్ పేరు మ్యూట్ చేయాలంది. మూవీ టీమ్ అభిప్రాయం తెలియజేయాలని కోర్టు కోరింది.
News July 10, 2025
చేపల కోసం వల వేస్తే ‘టో ఫిష్’ చిక్కింది

AP: విశాఖకు చెందిన మత్స్యకారుడు అప్పన్న చేపల కోసం వల వేయగా ఎంతో విలువైన ‘టో ఫిష్’ పరికరం చిక్కింది. అదేంటో అర్థంకాక మత్స్యశాఖ అధికారులకు ఆయన సమాచారమిచ్చారు. వాళ్లకూ తెలియక నేవీ అధికారులకు చెప్పగా అది అత్యాధునిక ‘టో ఫిష్’ పరికరమని తేల్చారు. గతేడాది డిసెంబర్ నుంచి తమకు సిగ్నల్స్ తెగిపోవడంతో దాని కోసమే వెతుకుతున్నామని చెప్పారు. కాగా సముద్ర గర్భంలో అధ్యయనం చేసేందుకు ఈ పరికరాన్ని వాడుతారు.