News July 9, 2025

పార్వతీపురం: 15 నుంచి పారిశుధ్య పక్షోత్సవాలు

image

పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రతను ప్రోత్సహించడానికి ఈనెల 15 నుంచి ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జూలై 15 నుంచి 30వ తేదీ వరకు పక్షోత్సవాలు జరుగుతాయని తెలిపారు. ప్రజలను కూడా ఇందులో భాగస్వాములను చేయాలని కలెక్టర్ సూచించారు.

Similar News

News July 11, 2025

విజయవాడ: యజమానిని చంపి పనిమనిషి పరార్

image

విజయవాడలో శుక్రవారం తెల్లవారు జామున దారుణం చోటు చేసుకుంది. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని NTR కాలనీలో వెంకట రామారావు (70) తన తల్లి సరస్వతితో కలిసి నివాసం ఉంటున్నాడు. తల్లిని చూసుకునేందుకు 3 రోజుల క్రితం అనూష అనే పని మనిషిని పెట్టుకున్నారు. ఆమె కూడా వారితో కలిసి అక్కడే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంటి యజమానిని హతమార్చి ఇంటిలో ఉన్న బంగారంతో పారిపోయిందని పోలీసులు తెలిపారు.

News July 11, 2025

GNT: చంద్రబాబు, లోకేశ్‌పై అంబటి ట్వీట్

image

వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కి చురకలంటించారు. ‘తల్లికి వందనం’ లోకేశ్ ఆలోచన. ‘ఉచిత విద్యుత్’ బాబు ఆలోచన అని చెప్తూ అమాయకపు ప్రజల్లారా నమ్మండి.!’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా అంబటి మెసేజ్‌పై టీడీపీ, వైసీపీ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పరస్పరం మాటల యుద్దం జరుగుతుంది.

News July 11, 2025

భారత వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్?

image

భారత వన్డే జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్‌కు గిల్ సారథ్యం వహిస్తారని రాసుకొచ్చాయి. అలాగే టీ20 వైస్ కెప్టెన్సీని కూడా అప్పగిస్తారని పేర్కొంటున్నాయి. దీనిపై ప్రస్తుత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మతో BCCI చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా గిల్ ప్రస్తుతం టెస్టు కెప్టెన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.