News March 30, 2024
సివిల్స్‌లో ఫెయిల్.. కానీ IAS అయ్యారు!

క్లిష్టమైన పరీక్షల్లో సివిల్స్ ఒకటి. ఈ పరీక్షలో ఫెయిల్ అయినా.. IAS అయిన కేరళకు చెందిన అబ్దుల్ నాసర్ గురించి మీకు తెలుసా? ఆయన 5 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయి అనాథాశ్రమంలో పెరిగారు. ఎన్నో సవాళ్ల నడుమ పీజీ పూర్తి చేశారు. 1994లో ఆరోగ్యశాఖలో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఆయన.. వృత్తిపరంగా కనబర్చిన నిబద్ధత, కృషికి గాను 2006 నాటికి డిప్యూటీ కలెక్టర్ అయ్యారు. 2017లో IAS హోదా పొంది తన కలను నెరవేర్చుకున్నారు.
Similar News
News March 20, 2026
ఇండియన్లు సంతోషంగా లేరు!

UN రిలీజ్ చేసిన ‘ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ రిపోర్ట్’ ప్రకారం ఇండియన్లు సంతోషంగా లేరని తేలింది. 147 దేశాలపై చేసిన స్టడీలో భారత్ 116వ స్థానంలో ఉంది. సామాజిక మద్దతు, ఆర్థిక అసమానతలు, పట్టణీకరణ, వ్యక్తిగత స్వేచ్ఛ, GDP, అవినీతి అంశాల ఆధారంగా ర్యాంకులు ఇచ్చింది. ఫిన్లాండ్ వరుసగా 9వ సారి టాప్-1గా నిలిచింది. అఫ్గాన్(147) చివర్లో ఉండగా, పాక్(104) మనకన్నా ముందుండటం ఆశ్చర్యకరం.
*నేడు అంతర్జాతీయ సంతోష దినోత్సవం
News March 20, 2026
రోడ్లపై ఉమ్మినందుకు ₹3.44 లక్షల ఫైన్!

లండన్‌లోని రోడ్లపై పాన్ ఉమ్మినందుకు ఇద్దరు భారతీయులకు అధికారులు ₹3.44 లక్షల జరిమానా విధించారు. గతేడాది జూన్‌లో కింగ్స్‌బరీ రోడ్డులో అక్షిత్ కుమార్, నార్త్ వెంబ్లే స్టేషన్ వద్ద హితేశ్ పటేల్ ఉమ్మేశారు. దీంతో వారికి 100 పౌండ్ల(₹12,533) చొప్పున అధికారులు స్పాట్ ఫైన్ వేశారు. కానీ వాళ్లు చెల్లించకపోవడంతో 1,391 పౌండ్ల(₹1.72 లక్షలు) చొప్పున ఫైన్ వేస్తూ బ్రెంట్ కౌన్సిల్ ఆదేశాలిచ్చింది.
News March 20, 2026
హార్ముజ్ జలసంధిలో టోల్ వసూలు.. ఇరాన్ ప్లాన్!

ప్రపంచ క్రూడాయిల్ సరఫరాలో అతి కీలకమైన హార్ముజ్ జలసంధిని ఉపయోగించుకుని ఆర్థికంగా లాభపడాలని ఇరాన్ ప్లాన్ వేస్తోంది. ఈ మార్గంలో వెళ్లే నౌకల నుంచి టోల్ వసూలు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం చట్టం తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు ఇరాన్ మీడియా తెలిపింది. జలసంధిలో సముద్ర రవాణా భద్రత వల్ల లబ్ధి పొందుతున్న దేశాలు ఇరాన్‌కు ఫీజులు, పన్నులు చెల్లించాలని ఓ చట్ట సభ్యుడు చెప్పినట్లు పేర్కొంది.


