News July 9, 2025
గోదావరిఖని: సింగరేణి ఆర్జీ-1లో 3,303 మంది విధులకు దూరం

దేశ వ్యాప్త సమ్మె సందర్భంగా సింగరేణి ఆర్జీ-1లో బుధవారం రెండు షిఫ్టుల్లో 3,303 మంది ఉద్యోగులు విధులకు దూరంగా ఉన్నారు. ఫస్ట్ షిఫ్ట్‌లో 3,169 మంది ఉద్యోగులు విధులు నిర్వహించాల్సి ఉండగా, 2,556 మంది గైర్హాజరయ్యారు. కేవలం 490 మంది హాజరు కాగా, అటెండెన్స్ 15.46% నమోదైంది. సెకండ్ షిఫ్ట్‌లో 883 మంది రావాల్సి ఉండగా, 747 మంది గైర్హాజరయ్యారు. 207 మంది హాజరు కాగా, అటెండెన్స్ 23.44% నమోదైంది.
Similar News
News July 10, 2025
చరిత్ర సృష్టించారు.. ఇంగ్లండ్‌పై తొలి టీ20 సిరీస్ కైవసం

ఇంగ్లండ్ ఉమెన్-టీమిండియా ఉమెన్ మధ్య జరిగిన నాలుగో టీ20లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ని ఇంకో మ్యాచ్ ఉండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. 127 పరుగుల లక్ష్యాన్ని 3 ఓవర్లు మిగిలుండగానే ఛేదించారు. ఇంగ్లండ్ ఉమెన్‌పై మనకు ఇదే తొలి సిరీస్ విజయం. ఇరు దేశాల మధ్య 6 ద్వైపాక్షిక సిరీస్లు జరగ్గా.. అన్నింటినీ ఇంగ్లండే గెలిచింది. రాధ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.
News July 10, 2025
సంగారెడ్డి: నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

నిరుద్యోగ ఎంబీసీ యువతీ, యువకులు వృత్తి నైపుణ్య శిక్షణ కోసం ఈ నెల 12లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీశ్ బుధవారం తెలిపారు. దరఖాస్తులను https://tgobmms.cgg.gov.inలో సమర్పించాలని పేర్కొన్నారు. సంబంధిత పత్రాలను డౌన్లోడ్ చేసి 14లోపు జిల్లా బీసీ అభివృద్ధి కార్యాలయంలో ఇవ్వాలన్నారు.
News July 10, 2025
మెదక్: యాప్‌లో వివరాలు నమోదు చేయాలి: డీఈవో

మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌లో నమోదు చేయాలని డీఈవో రాధా కిషన్ తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థులకు అందించిన పుస్తకాలు, యూనిఫామ్ వివరాలను యాప్‌లో నమోదు చేయాలన్నారు. నిర్లక్ష్యం వహించే ప్రధానోపాధ్యాయులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు.