News July 9, 2025
రేపు మరోసారి ఆస్పత్రికి కేసీఆర్

TG: బీఆర్ఎస్ అధినేత KCR రేపు ఉదయం మరోసారి HYD సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లనున్నారు. వైద్యుల సూచన మేరకు ఆస్పత్రికి వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల అనారోగ్యంతో 2రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న ఆయన నందినగర్ నివాసానికి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడింది. రేపు ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లనున్నట్లు సమాచారం.
Similar News
News July 10, 2025
ఆర్టీసీలో 422 కొత్త బస్సులు

TG: ఆర్టీసీ కొత్తగా 422 బస్సులు ప్రవేశపెట్టనుంది. కాలం చెల్లిన బస్సుల స్థానంలో 294 పల్లె వెలుగులు, 88 మెట్రో డీలక్స్‌లు, 23 డీలక్స్‌లు, 17 ఎక్స్‌ప్రెస్‌లను తీసుకురానుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరగడంతో ప్రయాణికులకు రిలీఫ్ ఇచ్చేందుకు RTC ఈ నిర్ణయం తీసుకుంది. 13-15లక్షల కి.మీ. తిరిగిన లేదా 15 ఏళ్ల కాలం దాటిన బస్సులను ఆర్టీసీ పక్కనపెట్టనుంది.
News July 10, 2025
ఇక బాక్సాఫీసుపై స్టార్ హీరోల దండయాత్ర

ఈ నెలాఖరు నుంచి దసరా వరకు వెండితెరపై స్టార్ హీరోలు సందడి చేయనున్నారు. ఈ నెల 24న హరిహర వీరమల్లుతో మొదలుకొని సెప్టెంబర్ 25న రిలీజ్ అయ్యే అఖండ-2 వరకు ఈ జోరు కొనసాగనుంది. విజయ్ దేవరకొండ-కింగ్డమ్(జులై 31), రజినీకాంత్-కూలీ(ఆగస్టు 14), NTR-‘వార్-2’(ఆగస్టు 14), పవన్ కళ్యాణ్-OG(సెప్టెంబర్ 25) ఈ మధ్యలోనే రానున్నాయి. మీరు ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు?
News July 10, 2025
ఇద్దరు భార్యలు, 45 ఏళ్ల వయసు అయినా..

అఫ్గానిస్థాన్‌లో 2021లో తాలిబన్లు అధికారం చేపట్టినప్పటి నుంచి బాల్య, బలవంతపు వివాహాలు 25 శాతం పెరిగాయని UNO తెలిపింది. తాజాగా హెల్మాండ్ ప్రావిన్స్‌లో 45 ఏళ్ల వ్యక్తి ఆరేళ్ల పాపను పెళ్లి చేసుకోవడం సంచలనంగా మారింది. అతడికి అప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నారని, డబ్బులు ఇచ్చి ఆ పాపను కొనుగోలు చేశాడని అఫ్గాన్ మీడియా తెలిపింది. ఈ విషయం అధికారులకు తెలియడంతో చిన్నారి తండ్రి, పెళ్లి కొడుకును అరెస్టు చేశారు.