News July 9, 2025

సిద్దిపేట: పోలీస్ కమిషనర్‌ను కలిసిన అడిషనల్ పీపీ

image

సిద్దిపేట అడిషనల్ అసిస్టెంట్ సెషన్ కోర్ట్ అడిషనల్ పీపీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీహెచ్ కనకయ్య పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ అనురాధను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. నూతనంగా అడిషనల్ పీపీగా బాధ్యతలు చేపట్టినందుకు కనకయ్యను సీపీ అభినందించారు. కేసులలో నేరస్థులకు శిక్షలు పడే విధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కీలకపాత్ర వహించాలని సూచించారు.

Similar News

News July 10, 2025

ఘట్‌కేసర్: కన్న తండ్రినే హతమార్చింది

image

ప్రియుడు, తల్లితో కలిసి కన్న తండ్రినే హతమార్చిన ఘటన ఘట్‌కేసర్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. ముషీరాబాద్- ముగ్గుబస్తీకి చెందిన వడ్లూరి లింగం(45), శారద దంపతుల పెద్ద కుమార్తె భర్తతో విడిపోయి వీరి వద్దే ఉంటుంది. మనీషా వివాహేతర సంబంధంపై తండ్రి హెచ్చరించాడు. దీంతో కక్ష పెంచుకున్న మనీషా.. ఈనెల 5న ప్రియుడు మహ్మద్ జావీద్‌, తల్లితో కలిసి తండ్రిని చంపేసి శవాన్ని ఏదులాబాద్ చెరువులో పడేశారు.

హుస్నాబాద్: బాత్‌రూంలో పడి గీతకార్మికుడు మృతి

image

అక్కన్నపేటకు చెందిన మాటూరి సదానందం బాత్‌రూంలో ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ఎస్సై చాతరాజు ప్రశాంత్ వివరాలు.. గతనెల 19న తాటిచెట్టుపై నుంచి కాలుజారి పడిపోయిన సదానందం, WGLలోని ఆస్పత్రిలో చికిత్స పొంది ఈనెల 5న ఇంటికి వచ్చారు. బుధవారం ఇంట్లోని బాత్‌రూంలో కాలుజారి మళ్ళీ కిందపడ్డాడు. హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.