News July 10, 2025
జగిత్యాల: ‘ప్రమోషన్లపై క్యాలెండర్‌ను రూపొందించాలి’

రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లపై ఒక క్యాలెండర్‌ను రూపొందించాలని తపస్ రాష్ట్ర సహ అధ్యక్షుడు నరేందర్ రావు, జిల్లా అధ్యక్షుడు దేవయ్య కోరారు. బుధవారం జగిత్యాల పట్టణంలోని పలు పాఠశాలలో తపస్ సభ్యత్వాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఇటీవల రిటైర్‌మెంట్లు ప్రారంభమైన నైపథ్యంలో వందలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ అవుతున్నాయన్నారు. దీనిపై క్యాలెండర్ రూపొందిస్తే ఉపాధ్యాయుల కొరత సులభంగా తీరుతుందన్నారు.
Similar News
News July 10, 2025
హుస్నాబాద్: బాత్‌రూంలో పడి గీతకార్మికుడు మృతి

అక్కన్నపేటకు చెందిన మాటూరి సదానందం బాత్‌రూంలో ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ఎస్సై చాతరాజు ప్రశాంత్ వివరాలు.. గతనెల 19న తాటిచెట్టుపై నుంచి కాలుజారి పడిపోయిన సదానందం, WGLలోని ఆస్పత్రిలో చికిత్స పొంది ఈనెల 5న ఇంటికి వచ్చారు. బుధవారం ఇంట్లోని బాత్‌రూంలో కాలుజారి మళ్ళీ కిందపడ్డాడు. హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News July 10, 2025
సత్యసాయి భక్తులు గ్రేట్…!

విశాఖలో జరిగిన గిరిప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు వచ్చారు. కిలో మీటర్ల మేర పాదయాత్ర చేసిన భక్తులకు ఉపశమనం కల్పించేందుకు విశాఖ జిల్లా శ్రీసత్య సాయి సేవా సంస్థ సేవలు అందించింది. ప్రదక్షిణ జరిగిన పలు ప్రాంతాల్లో ప్రత్యేక వనమూలికలతో తయారు చేసిన నూనెతో భక్తుల కాళ్లకు మర్దన చేశారు. టీ, మిర్యాల పాలు, ప్రసాదం, అల్పాహారం అందించారు. ఎమ్మెల్యే గణబాబు వీరి సేవలను వీక్షించి అభినందించారు.
News July 10, 2025
వరంగల్: రవాణా శాఖలోనే అవినీతి ఎక్కువ..!

ఉమ్మడి జిల్లాలో ACB దాడులను ముమ్మరం చేసింది. ఈ ఏడాది రాష్ట్రంలో 126 కేసులుండగా.. జిల్లాలో 10 కేసుల్లో 18 మందిని అరెస్టు చేశారు. రవాణా శాఖలో ఆరుగురు, పంచాయతీరాజ్ శాఖలో నలుగురు, విద్యా శాఖలో ఇద్దరు చొప్పున మొత్తం 10 కేసుల్లో 18 మందిని ACB అధికారులు పట్టుకున్నారు. HNK జిల్లాలో 2, WGL 1, జనగామ 2, MHBDలో 3, ములుగులో 2 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే రవాణా శాఖలోనే అవినీతి ఎక్కువగా ఉందనే విమర్శలు ఉన్నాయి.