News July 10, 2025
HNK: జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్

✓ ఓరుగల్లులో అవినీతి మామూలుగా లేదు!
✓ కాజీపేటలో 73 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
✓ గుట్కాలు విక్రయిస్తే నేరం: టాస్క్‌ఫోర్స్ ACP
✓ WGL: హత్య కేసులో ఇద్దరికీ పదేళ్ల జైలు శిక్ష
✓ వేధిస్తే షీ-టీంకు తెలుపండి: షీ-టీం ఇన్‌స్పెక్టర్
✓ ఆత్మకూరు: కల్లును కల్తీ చేస్తే జైలుకే: ఇన్‌స్పెక్టర్
✓ మరిపెడ మండలంలో NIA సోదాలు
Similar News
News July 10, 2025
వరంగల్: రవాణా శాఖలోనే అవినీతి ఎక్కువ..!

ఉమ్మడి జిల్లాలో ACB దాడులను ముమ్మరం చేసింది. ఈ ఏడాది రాష్ట్రంలో 126 కేసులుండగా.. జిల్లాలో 10 కేసుల్లో 18 మందిని అరెస్టు చేశారు. రవాణా శాఖలో ఆరుగురు, పంచాయతీరాజ్ శాఖలో నలుగురు, విద్యా శాఖలో ఇద్దరు చొప్పున మొత్తం 10 కేసుల్లో 18 మందిని ACB అధికారులు పట్టుకున్నారు. HNK జిల్లాలో 2, WGL 1, జనగామ 2, MHBDలో 3, ములుగులో 2 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే రవాణా శాఖలోనే అవినీతి ఎక్కువగా ఉందనే విమర్శలు ఉన్నాయి.
News July 10, 2025
జిల్లా కలెక్టర్లకు రిజిస్ట్రేషన్ల రద్దు అధికారం

AP: అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్ల రద్దు అధికారం జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ యాక్ట్ అమెండ్‌మెంట్-2023 బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో చట్టం అమల్లోకి వచ్చింది. గతంలో ఈ అధికారం కేవలం సివిల్ కోర్టులకు మాత్రమే ఉండేది. దీంతో ఫోర్జరీ డాక్యుమెంట్లు, అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులు పేరుకుపోతుండటంతో ప్రభుత్వం ఈ మార్పులు చేసింది.
News July 10, 2025
KTDM: వైద్య విద్యార్థులకు అందని మెరుగైన విద్య.!

పాల్వంచ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడింట్స్, ట్యూటర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో వైద్య విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని దుస్థితి. మొత్తం 196 ప్రధాన పోస్టులకు గానూ 108 ఖాళీలున్నాయి. కాలేజీకి సొంత భవనం లేకపోవడంతో నర్సింగ్ కళాశాలలో కొనసాగుతుంది. వీటిపై NMC అభ్యంతరం వ్యక్తం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది.