News July 10, 2025

400 రన్స్ చేసే అవకాశాలు మళ్లీ మళ్లీ రావు: గేల్

image

SA కెప్టెన్ ముల్డర్ ఇటీవల టెస్టులో 400రన్స్ చేసే అవకాశం ఉన్నా వద్దనుకోవడం చర్చనీయాంశమైంది. దీనిపై WI క్రికెట్ దిగ్గజం గేల్ స్పందించారు. ఇటువంటి అవకాశాలు మళ్లీ మళ్లీ రావన్నారు. ఛాన్స్ దొరికినప్పుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తనకు ఇటువంటి అవకాశమొస్తే వదలనని చెప్పారు. లారా(400*) రికార్డును అధిగమించే ఉద్దేశం లేకే 367* స్కోర్ వద్ద డిక్లేర్ చేసినట్లు ముల్డర్ వెల్లడించిన విషయం తెలిసిందే.

Similar News

News July 10, 2025

HCAలో అక్రమాలు.. ముగ్గురిపై కేసు నమోదు

image

HYD క్రికెట్ అసోసియేషన్‌(HCA)లో నిధుల దుర్వినియోగంపై CID దర్యాప్తు జరుపుతోంది. అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కోశాధికారి శ్రీనివాస రావు, CEO సునీల్‌పై కేసు నమోదు చేసింది. వీరితో పాటు శ్రీచక్ర క్రికెట్ క్లబ్‌కు చెందిన రాజేందర్, కవితను అదుపులోకి తీసుకుంది. సంతకాల ఫోర్జరీ, నకిలీ దస్త్రాలు సృష్టించడంపై విచారిస్తోంది. కాగా SRHను బెదిరించిన కేసులో నిన్న జగన్మోహన్‌ <<17008940>>అరెస్ట్<<>> అయిన సంగతి తెలిసిందే.

News July 10, 2025

పూజారి అసభ్యంగా తాకాడు: నటి

image

మలేషియాలోని ఆలయంలో పూజారి తనను వేధించినట్లు భారత సంతతి నటి లిశల్లిని కనరన్‌ను ఆరోపించారు. గత నెల 21న సెపంగ్‌లోని మరియమ్మన్ టెంపుల్‌లో ఈ ఘటన జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. పూజారి తనను అసభ్యంగా ఛాతీపై తాకుతూ భారత్ నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలం అంటూ నీటిని తనపై పోశాడని ఆమె ఇన్‌స్టాలో ఆరోపించారు. దీనిపై ఈ నెల 4న మలేషియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూజారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

News July 10, 2025

రక్తపోటును తగ్గించే ఔషధం!

image

జీవనశైలి మార్పులతో చాలా మంది హైబీపీతో బాధపడుతున్నారు. అయితే శ్వాస వ్యాయామం ద్వారా రక్తపోటును తగ్గించొచ్చని వైద్యులు చెబుతున్నారు. నిమిషానికి ఆరుసార్లు శ్వాస తీసుకోవడం/వదలడం చేస్తే నాడీ వ్యవస్థ, BPని నార్మల్‌కు తీసుకురావొచ్చంటున్నారు. నార్మల్ కేసుల్లో జీవనశైలి & శ్వాస పద్ధతుల ద్వారా మందుల అవసరాన్ని తగ్గించొచ్చని తెలిపారు. 10-20 ని.లకు ఒక సెషన్‌గా రోజులో 3 నుంచి 4 సార్లు ఇది ప్రాక్టీస్ చేయాలన్నారు.