News July 10, 2025

MNCL: సమగ్ర శిక్షా నూతన జెండర్ & డిప్యూటీ కోఆర్డినేటర్‌గా విజయలక్ష్మి

image

మంచిర్యాల జిల్లా సమగ్ర శిక్షా నూతన జెండర్ & డిప్యూటీ కోఆర్డినేటర్‌గా విజయలక్ష్మి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆమె దండేపల్లి మండలంలోని వెల్గనూర్ జడ్పీ ఉన్నత పాఠశాల గెజిటెడ్ హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో బాలికలకు భద్రత, భరోసాతో కూడిన నాణ్యమైన విద్య అందించి ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఈఓ యాదయ్య సూచించారు.

Similar News

News July 10, 2025

హుస్నాబాద్: బాత్‌రూంలో పడి గీతకార్మికుడు మృతి

image

అక్కన్నపేటకు చెందిన మాటూరి సదానందం బాత్‌రూంలో ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ఎస్సై చాతరాజు ప్రశాంత్ వివరాలు.. గతనెల 19న తాటిచెట్టుపై నుంచి కాలుజారి పడిపోయిన సదానందం, WGLలోని ఆస్పత్రిలో చికిత్స పొంది ఈనెల 5న ఇంటికి వచ్చారు. బుధవారం ఇంట్లోని బాత్‌రూంలో కాలుజారి మళ్ళీ కిందపడ్డాడు. హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News July 10, 2025

సత్యసాయి భక్తులు గ్రేట్…!

image

విశాఖలో జరిగిన గిరిప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు వచ్చారు. కిలో మీటర్ల మేర పాదయాత్ర చేసిన భక్తులకు ఉపశమనం కల్పించేందుకు విశాఖ జిల్లా శ్రీసత్య సాయి సేవా సంస్థ సేవలు అందించింది. ప్రదక్షిణ జరిగిన పలు ప్రాంతాల్లో ప్రత్యేక వనమూలికలతో తయారు చేసిన నూనెతో భక్తుల కాళ్లకు మర్దన చేశారు. టీ, మిర్యాల పాలు, ప్రసాదం, అల్పాహారం అందించారు. ఎమ్మెల్యే గణబాబు వీరి సేవలను వీక్షించి అభినందించారు.

News July 10, 2025

వరంగల్: రవాణా శాఖలోనే అవినీతి ఎక్కువ..!

image

ఉమ్మడి జిల్లాలో ACB దాడులను ముమ్మరం చేసింది. ఈ ఏడాది రాష్ట్రంలో 126 కేసులుండగా.. జిల్లాలో 10 కేసుల్లో 18 మందిని అరెస్టు చేశారు. రవాణా శాఖలో ఆరుగురు, పంచాయతీరాజ్‌ శాఖలో నలుగురు, విద్యా శాఖలో ఇద్దరు చొప్పున మొత్తం 10 కేసుల్లో 18 మందిని ACB అధికారులు పట్టుకున్నారు. HNK జిల్లాలో 2, WGL 1, జనగామ 2, MHBDలో 3, ములుగులో 2 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే రవాణా శాఖలోనే అవినీతి ఎక్కువగా ఉందనే విమర్శలు ఉన్నాయి.