News July 10, 2025

శుభ సమయం (10-07-2025) గురువారం

image

✒ తిథి: శుక్ల పూర్ణిమ రా.1.02 వరకు తదుపరి పాడ్యమి
✒ నక్షత్రం: పూర్వాషాడ పూర్తిగా ✒ శుభ సమయం: ఉ.11.25-మ.12 వరకు తిరిగి సా.6.25- రా.7.13 వరకు ✒ రాహుకాలం: మ.1.30-3.00 వరకు
✒ యమగండం: ఉ.6.00-7.30 వరకు ✒ దుర్ముహూర్తం: ఉ.10.00-10.48 వరకు పునః మ.2.48- 3.36 వరకు ✒ వర్జ్యం: మ.3.20-సా.5.01 వరకు ✒ అమృత ఘడియలు: రా.1.08-2.48 వరకు

Similar News

News July 10, 2025

తెలంగాణ లేకుండా చిత్రపటం బహూకరించారు: BRS MLC

image

ఏపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర గుర్తింపును తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని BRS MLC శ్రవణ్ ఆరోపించారు. మంత్రి లోకేశ్‌కు AP BJP చీఫ్ మాధవ్ తాజాగా భారతదేశ చిత్రపటాన్ని బహూకరించారు. ఇందులో TGని ప్రత్యేకంగా చూపకుండా ఉమ్మడి APని చూపించారని శ్రవణ్ మండిపడ్డారు. ‘ఇది TG గుర్తింపుపై AP నేతలు చేస్తున్న రాజకీయ కుట్రను సూచిస్తోంది’ అని ట్వీట్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని TG DGPని కోరారు.

News July 10, 2025

ప్రభాస్ న్యూ లుక్.. పిక్ వైరల్

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త లుక్‌లో కనిపించారు. డార్లింగ్ న్యూ లుక్ వావ్ అనేలా ఉంది. ‘రాజాసాబ్’ సెట్స్‌లో నిర్మాత ఎస్కేఎన్‌కు ఆయన బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోను ఎస్కేఎన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ డార్లింగ్ లేటెస్ట్ లుక్‌కు ఫిదా అవుతున్నారు. కాగా మారుతి-ప్రభాస్ కాంబోలో వస్తున్న ‘రాజాసాబ్’ మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది.

News July 10, 2025

సినిమా ఎఫెక్ట్.. ఇక బ్యాక్ బెంచర్లు ఉండరు!

image

ఫస్ట్ బెంచీ స్టూడెంట్స్ చురుకైనవారని, లాస్ట్ బెంచీ వారు అల్లరివారు, చదువురాదనే ధోరణి ఉంది. దానికి కేరళలోని పాఠశాలలు ‘U సీటింగ్ మోడల్‌’తో చెక్ పెడుతున్నాయి. మలయాళ సినిమా ‘స్థనార్థి శ్రీకుట్టన్’ స్ఫూర్తిగా బ్యాక్‌బెంచర్లు ఉండొద్దని అర్ధ వృత్తాకారంలో విద్యార్థులను కూర్చోబెడుతున్నాయి. ఈ ‘U సీటింగ్’ అసమానతలను తొలగించి, అంతా సమానమనే ఆలోచన తీసుకొస్తుంది. మన దగ్గర ఇలా చేస్తే బాగుంటుంది కదా.