News July 10, 2025

భద్రాద్రి: ‘ఆయిల్‌పామ్ రైతులు ఫోన్ చేయండి’

image

ఆయిల్‌పామ్ రైతుల సౌకర్యార్థం ఆయిల్ ఫెడ్‌కు టోల్ ఫ్రీ నంబర్ 81430 21010 ఏర్పాటు చేసినట్లు ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి తెలిపారు. ఆయిల్‌పామ్ రైతులు తమ సందేహాలను నంబర్‌కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని సూచించారు. అలాగే తమ ఫిర్యాదులను తెలియజేస్తే పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. SHARE IT

Similar News

News July 10, 2025

జమ్మికుంట: గంజాయి విక్రయం.. నలుగురి అరెస్టు

image

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఎఫ్‌సీఐ సమీపంలో నిషేధిత గంజాయి అమ్మేందుకు వచ్చిన నలుగురు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు హుజురాబాద్ ఏసీపీ మాధవి తెలిపారు. జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్‌లో పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. రెండు బైకులపై వచ్చిన నలుగురు యువకులను పట్టుకుని విచారించి వివరాలు సేకరించినట్లు చెప్పారు.

News July 10, 2025

ఎన్టీఆర్: ఈ నెల 12తో ముగియనున్న గడువు

image

ఎనికేపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో ఛార్టర్డ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ ఉద్యోగాలకు (కాంట్రాక్ట్) అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశా సూచించారు. ఈ నెల 12లోపు అభ్యర్థులు తమ కొటేషన్‌లను విజయవాడలోని కలెక్టర్, JC కార్యాలయంలో అందజేయాలన్నారు. మూడేళ్ల అనుభవం ఉండి అకౌంటింగ్ సిస్ట‌మ్స్‌, టూల్స్ ప్రొఫిష‌య‌న్సీ, ఫైలింగ్‌‌ తదితర అంశాలలో పరిజ్ఞానం ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు.

News July 10, 2025

రక్తపోటును తగ్గించే ఔషధం!

image

జీవనశైలి మార్పులతో చాలా మంది హైబీపీతో బాధపడుతున్నారు. అయితే శ్వాస వ్యాయామం ద్వారా రక్తపోటును తగ్గించొచ్చని వైద్యులు చెబుతున్నారు. నిమిషానికి ఆరుసార్లు శ్వాస తీసుకోవడం/వదలడం చేస్తే నాడీ వ్యవస్థ, BPని నార్మల్‌కు తీసుకురావొచ్చంటున్నారు. నార్మల్ కేసుల్లో జీవనశైలి & శ్వాస పద్ధతుల ద్వారా మందుల అవసరాన్ని తగ్గించొచ్చని తెలిపారు. 10-20 ని.లకు ఒక సెషన్‌గా రోజులో 3 నుంచి 4 సార్లు ఇది ప్రాక్టీస్ చేయాలన్నారు.