News July 10, 2025

సంగారెడ్డి: ఆయిల్‌పామ్‌ సాగుతో అధిక లాభాలు: కలెక్టర్

image

ఆయిల్‌ పామ్‌ సాగు రైతులకు లాభదాయకమని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. బుధవారం జహీరాబాద్ మండలం గోవింద్ పూర్ గ్రామంలో నాగిశెట్టి రాథోడ్ పొలంలో ఆయిల్‌ పామ్‌ మొక్కలు నాటారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు ఆయిల్‌ పామ్‌ సాగు చేయాలని సూచించారు. 90% రాయితీతో మొక్కలు, డ్రిప్ పరికరాలు, అంతర పంటలకు ఎకరాకు రూ.4,200 ప్రోత్సాహకంగా ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు.

Similar News

News July 10, 2025

మరికల్: Way2News కథనానికి స్పందన.. శ్మశాన మార్గానికి కల్వర్టు

image

మరికల్ మండల కేంద్రంలోని నాయీ బ్రాహ్మణ <<17016546>>శ్మశాన<<>> వాటికకు నడుము లోతు నీటిలో వెళ్లాల్సిన దుస్థితిపై ఏప్రిల్ 9న Way2Newsలో ప్రచురితమైంది. ఈ కథనానికి నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి స్పందించారు. ఎస్‌డీఎఫ్ నిధులు మంజూరు చేయడంతో కల్వర్టు నిర్మాణం పూర్తయింది. ఈరోజు ఆమె ప్రారంభించారు. నాయీ బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు, రైతులు Way2Newsకు కృతజ్ఞతలు తెలిపారు.

News July 10, 2025

NLG: ‘ఎంపీడీవోలు పనితీరును మెరుగు పరచుకోవాలి’

image

అన్ని ప్రభుత్వ పథకాలలో పురోగతి తీసుకువచ్చేలా ఎంపీడీవోలు పనితీరును మెరుగుపరచుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం నల్గొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఏపీవోలతో వివిధ అంశాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో అతిసారం, నీటి వల్ల సంక్రమించే వ్యాధులు పెరగకుండా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాల్సిన బాధ్యత పూర్తిగా గ్రామ పంచాయతీలదేనని అన్నారు.

News July 10, 2025

ఆర్చరీ వరల్డ్ కప్‌లో అదరగొట్టిన విజయవాడ యువతి

image

విజయవాడకు చెందిన ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ మాడ్రిడ్ (స్పెయిన్)లో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్‌లో అదరగొట్టే ప్రదర్శన చేసింది. మహిళలు, మిక్స్‌డ్ టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సురేఖ, పర్ణీత్, ప్రీతికలతో కూడిన మహిళా బృందం, అలాగే మిక్స్‌డ్ విభాగంలో రిషభ్, సురేఖలు బుధవారం జరిగిన సెమీస్‌లో మెరుగైన పాయింట్లు సాధించి ఫైనల్‌లో అదరగొట్టారు.