News July 10, 2025
జగిత్యాల జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కృషి: మంత్రి

జగిత్యాల జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జిల్లా అభివృద్ధిపై కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని, సాగు, తాగునీరు విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. నిధులు తెచ్చే బాధ్యత నాది అని, అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, పథకాలు పేదలకు అందేలా చూడాలన్నారు. కలెక్టర్, జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు ఉన్నారు.
Similar News
News July 10, 2025
NLG: ‘ఎంపీడీవోలు పనితీరును మెరుగు పరచుకోవాలి’

అన్ని ప్రభుత్వ పథకాలలో పురోగతి తీసుకువచ్చేలా ఎంపీడీవోలు పనితీరును మెరుగుపరచుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం నల్గొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఏపీవోలతో వివిధ అంశాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో అతిసారం, నీటి వల్ల సంక్రమించే వ్యాధులు పెరగకుండా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాల్సిన బాధ్యత పూర్తిగా గ్రామ పంచాయతీలదేనని అన్నారు.
News July 10, 2025
ఆర్చరీ వరల్డ్ కప్‌లో అదరగొట్టిన విజయవాడ యువతి

విజయవాడకు చెందిన ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ మాడ్రిడ్ (స్పెయిన్)లో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్‌లో అదరగొట్టే ప్రదర్శన చేసింది. మహిళలు, మిక్స్‌డ్ టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సురేఖ, పర్ణీత్, ప్రీతికలతో కూడిన మహిళా బృందం, అలాగే మిక్స్‌డ్ విభాగంలో రిషభ్, సురేఖలు బుధవారం జరిగిన సెమీస్‌లో మెరుగైన పాయింట్లు సాధించి ఫైనల్‌లో అదరగొట్టారు.
News July 10, 2025
ADB: ఆవు మృతితో ఆ ఊరంతా కన్నీళ్లు

బజార్హత్నూర్ మండల కేంద్రంలోని శివాలయానికి చెందిన ఆవు మృతి చెందింది. 20 ఏళ్ల క్రితం సబ్బిడి పుష్పలత, నందు కుమార్ కుటుంబ సభ్యులు ఆలయానికి అవును విరాళంగా అందించగా, 16 దూడెలకు జన్మనిచ్చింది. రెండు దశాబ్దాలుగా ఆలయంలో దూప, దీప, నైవేద్యాలకు ఆదాయాన్ని సమకూర్చిన ఆవు కన్నుమూయడంతో గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామస్థులంతా కలిసి డప్పు వాయిద్యాలతో అంత్యక్రియలు నిర్వహించారు.