News July 10, 2025
NLG: మూసీ నది జన్మస్థానం మీకు తెలుసా?

మూసీ నది 2,168 అడుగుల ఎత్తులో ఉద్భవిస్తుంది. ఆశ్చర్యంగా ఉన్నా దీని జన్మస్థానం వికారాబాద్‌లోని అనంతగిరి కొండలు. అక్కడ ఒక్కో బొట్టుగా మొదలై అనంతపద్మనాభుని ఆలయ కొలనులోకి చేరుతుంది. దీని ప్రవాహం అక్కడ మొదలై నదిగా మారి HYDలోకి ఎంట్రీ పోచంపల్లి, కేతేపల్లి గుండా నల్గొండ వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. మహానగరమంతా దీని ఒడ్డునే జీవం పోసుకుంది. ముచ్కుంద మహానది కాలక్రమేనా మూసీగా పేరు మారింది.
Similar News
News July 10, 2025
ఆర్చరీ వరల్డ్ కప్‌లో అదరగొట్టిన విజయవాడ యువతి

విజయవాడకు చెందిన ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ మాడ్రిడ్ (స్పెయిన్)లో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్‌లో అదరగొట్టే ప్రదర్శన చేసింది. మహిళలు, మిక్స్‌డ్ టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సురేఖ, పర్ణీత్, ప్రీతికలతో కూడిన మహిళా బృందం, అలాగే మిక్స్‌డ్ విభాగంలో రిషభ్, సురేఖలు బుధవారం జరిగిన సెమీస్‌లో మెరుగైన పాయింట్లు సాధించి ఫైనల్‌లో అదరగొట్టారు.
News July 10, 2025
ADB: ఆవు మృతితో ఆ ఊరంతా కన్నీళ్లు

బజార్హత్నూర్ మండల కేంద్రంలోని శివాలయానికి చెందిన ఆవు మృతి చెందింది. 20 ఏళ్ల క్రితం సబ్బిడి పుష్పలత, నందు కుమార్ కుటుంబ సభ్యులు ఆలయానికి అవును విరాళంగా అందించగా, 16 దూడెలకు జన్మనిచ్చింది. రెండు దశాబ్దాలుగా ఆలయంలో దూప, దీప, నైవేద్యాలకు ఆదాయాన్ని సమకూర్చిన ఆవు కన్నుమూయడంతో గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామస్థులంతా కలిసి డప్పు వాయిద్యాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
News July 10, 2025
టీటీడీ తొలి ఈవో ఎవరంటే?

చెలికాని అన్నారావు 1933లో తిరుమల ఆలయ పేష్కారుగా చేరారు. 1949లో కమిషనర్‌గా, 1951 నుంచి 1964 వరకు TTD తొలి ఈవోగా పని చేశారు. 1974 నుంచి 1979 వరకు తొలి TTD ఛైర్మన్‌గా శ్రీవారి సేవలో తరించారు. రేడియోల్లో స్వామివారి సుప్రభాత ప్రసారం, ఘాట్ రోడ్డులో దేవస్థానం బస్సు, TTD విద్యాసంస్థలు, లెప్రర్సీ ఆసుపత్రి, ఎంప్లాయిస్ బ్యాంకు ఏర్పాటు చేశారు. వీటికి గుర్తుగా 2007లో తిరుపతిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.