News July 10, 2025

భువనగిరి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన మోత్కూర్ జామచెట్లబావి ఎక్స్ రోడ్డులో బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికుల వివరాలిలా.. గుండాల మండలం వంగాలకి చెందిన చిప్పలపల్లి శంకర్ (48) టీవీఎస్‌పై మోత్కూర్ నుంచి ఇంటికి వెళుతున్నాడు. ఓ మైనర్ బాలుడు బైక్‌పై అతి వేగంగా వచ్చి శంకర్ వాహనాన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

Similar News

News July 10, 2025

కొనసాగుతున్న తెలంగాణ క్యాబినెట్ భేటీ

image

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ భేటీ కొనసాగుతోంది. ఇందులో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. బీసీ రిజర్వేషన్లపై మంత్రిమండలి నిర్ణయం తీసుకోనుంది. గోదావరి జలాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులపైనా చర్చ జరగనుంది.

News July 10, 2025

ఆర్థిక, ఆరోగ్య భద్రతతో కూడిన విద్యే ‘కూటమి’ లక్ష్యం: మంత్రి సవిత

image

ఆర్థిక, ఆరోగ్య భద్రతతో కూడిన నాణ్యమైన విద్య అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. పెనుకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా పీటీఎం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. విద్య అందరికీ అందుబాటులో ఉండేలా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నేతృత్వంలో విద్యా వ్యవస్థలో పెనుమార్పులు తీసుకొచ్చారన్నారు. త్వరలో రెండో విడత తల్లికి వందనం నిధులు అమలు చేస్తామన్నారు.

News July 10, 2025

MDK: విషాదం.. గర్భిణీ ఆత్మహత్య

image

కుటుంబ కలహాలతో గర్భిణీ ఆత్మహత్య చేసుకున్న ఘటన టేక్మాల్ మండలం హస్సన్ మహమ్మద్ పల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన మానసకు పెద్ద శంకరంపేట మండలం మూసాపేటకు చెందిన గంగమేశ్వర్‌తో వివాహం జరిగింది. ఇటీవల కాన్పు విషయంలో రెండు కుటుంబాల మద్య విభేదాలు వచ్చాయి. మనస్తాపంతో మానస ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గంగమేశ్వర్ పై యువతి తండ్రి సాయిలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది.