News July 10, 2025
టీబీ కేసుల గుర్తింపు కోసం క్యాంపులు ఏర్పాటు చేయాలి: కలెక్టర్

స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం పీహెచ్‌సీని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టీబీ ముక్త్ భారత్ 100 రోజుల యాజిక్యంపై సమీక్షించారు. టీబీ కేసుల గుర్తింపు కోసం క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. డాక్టర్ ప్రణీత, ఫార్మాసిస్ట్ ప్రపుల్ల, ల్యాబ్ టెక్నీషియన్ మహేశ్ తదితరులున్నారు.
Similar News
News July 10, 2025
ఆర్థిక, ఆరోగ్య భద్రతతో కూడిన విద్యే ‘కూటమి’ లక్ష్యం: మంత్రి సవిత

ఆర్థిక, ఆరోగ్య భద్రతతో కూడిన నాణ్యమైన విద్య అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. పెనుకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా పీటీఎం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. విద్య అందరికీ అందుబాటులో ఉండేలా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నేతృత్వంలో విద్యా వ్యవస్థలో పెనుమార్పులు తీసుకొచ్చారన్నారు. త్వరలో రెండో విడత తల్లికి వందనం నిధులు అమలు చేస్తామన్నారు.
News July 10, 2025
MDK: విషాదం.. గర్భిణీ ఆత్మహత్య

కుటుంబ కలహాలతో గర్భిణీ ఆత్మహత్య చేసుకున్న ఘటన టేక్మాల్ మండలం హస్సన్ మహమ్మద్ పల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన మానసకు పెద్ద శంకరంపేట మండలం మూసాపేటకు చెందిన గంగమేశ్వర్‌తో వివాహం జరిగింది. ఇటీవల కాన్పు విషయంలో రెండు కుటుంబాల మద్య విభేదాలు వచ్చాయి. మనస్తాపంతో మానస ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గంగమేశ్వర్ పై యువతి తండ్రి సాయిలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది.
News July 10, 2025
గన్నవరం: కుమారులని రక్షించాలంటూ పవన్‌కి తల్లి వినతి

ఉద్యోగాల కోసం ఏజెంట్ చేతిలో మోసపోయి విదేశాల్లో మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో ఉన్న తన ఇద్దరి కుమారులను రక్షించాలంటూ సూర్యకుమారి Dy.CM పవన్‌ని గన్నవరం ఎయిర్‌పోర్టులో గురువారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి, విదేశాల్లో ఉన్నవారిని తిరిగి రప్పిస్తానని అన్నారు.