News July 10, 2025
సంగారెడ్డి: నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

నిరుద్యోగ ఎంబీసీ యువతీ, యువకులు వృత్తి నైపుణ్య శిక్షణ కోసం ఈ నెల 12లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీశ్ బుధవారం తెలిపారు. దరఖాస్తులను https://tgobmms.cgg.gov.inలో సమర్పించాలని పేర్కొన్నారు. సంబంధిత పత్రాలను డౌన్లోడ్ చేసి 14లోపు జిల్లా బీసీ అభివృద్ధి కార్యాలయంలో ఇవ్వాలన్నారు.
Similar News
News July 10, 2025
GHMCలో మీడియాపై ఆంక్షలు?

GHMC కార్యాలయాల్లోకి మీడియా ఎంట్రీని వారానికి ఒక్కరోజే అనుమతించాలని స్టాండింగ్ కమిటీ తీర్మానించినట్లు తెలుస్తోంది. ముందు పూర్తిగా నిషేధించాలని భావించినా, చర్చల అనంతరం ఒక్కరోజుకు వెసులుబాటు కల్పించింది. దీంతో GHMC, జోనల్, సర్కిల్ కార్యాలయాల్లోకి మీడియాకు వారానికి ఒక్కరోజే అనుమతి ఉండనుంది. తమ విధులకు ఆటంకం కలగకుండా ఉండేందుకే దీనికి కారణంగా తెలుస్తోండగా.. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
News July 10, 2025
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఎప్పుడు అంటే…

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్నాయి.
16-09-2025 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
– 23-09-2025 శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
– 24-09-2025 ధ్వజారోహణం.
– 28-09-2025 గరుడ వాహనం.
– 01-10-2025 రథోత్సవం.
– 02-10-2025 చక్రస్నానం.
– ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు టీటీడీ అధికారులు నిర్వహించనున్నారు.
News July 10, 2025
భద్రాచలం ఆలయ భూ సమస్యలు.. ఆ మండలాలతోనే: మంత్రి

భద్రాద్రి రాముడికి చెందిన 1,300 ఎకరాల భూమిలో సింహభాగం ఎటపాక మండల పరిధిలో ఉండడం వల్లే భూ వివాదం తలెత్తుతోందని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఎటపాక(M)లో దాదాపు 889.5 ఎకరాల భూమి ఉందన్నారు. కోర్టు తీర్పు ప్రకారం ఈ భూమిపై పూర్తి హక్కులు దేవస్థానానికి ఉందని తెలిపారు. ఇప్పటికే 60 కట్టడాలు అక్రమంగా వెలిశాయని, ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. 7 మండలాలు ఏపీలో కలపడం వల్లే ఈ సమస్య ఏర్పడిందని చెప్పారు.