News July 10, 2025

చింతపల్లి ఎస్సైపై హైకోర్టు ఆగ్రహం

image

నల్గొండ జిల్లా చింతపల్లి ఎస్సై రామ్మూర్తిపై హైకోర్టు ఆగ్రహం చేసింది. టీవీ యాంకర్‌ శిల్పా చక్రవర్తి దంపతులకు సంబంధించిన భూ వివాదంలో తలదూర్చిన ఎస్సై వారిని స్టేషన్‌కు పిలిపించారు. ఈ వ్యవహారాన్ని బలవంతంగా సెటిల్‌ చేసేందుకు యత్నించారని శిల్పా చక్రవర్తి దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ ఎస్సైకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Similar News

News July 10, 2025

విజయసాయి రెడ్డికి మరోసారి సిట్ నోటీసులు

image

AP: లిక్కర్‌ స్కాం కేసులో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి సిట్‌ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 12న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని అందులో పేర్కొంది. కాగా ఈ కేసులో ఇప్పటికే విజయసాయి ఒకసారి విచారణకు హాజరయ్యారు.

News July 10, 2025

కష్టపడుతున్న భారత బౌలర్లు

image

భారత్‌తో మూడో టెస్టులో ఫస్ట్ సెషన్‌లో కాస్త తడబడ్డ ఇంగ్లండ్ రెండో సెషన్‌లో ఆధిపత్యం చెలాయించింది. టీ విరామం సమయానికి ఆ జట్టు 2 వికెట్లకు 153 రన్స్ చేసింది. రూట్ 54*, పోప్ 44* రన్స్‌తో క్రీజులో నిలదొక్కుకున్నారు. 44 రన్స్‌కే ఇద్దరు ఇంగ్లిష్ బ్యాటర్ల వికెట్లు తీసిన నితీశ్ భారత్‌కు మంచి ఓపెనింగ్ ఇచ్చారు. అయితే మిగతా బౌలర్లు బుమ్రా, సిరాజ్, ఆకాశ్ ప్రభావం చూపలేకపోయారు.

News July 10, 2025

BRAOUలో ఏ పరీక్షలు వాయిదా అంటే!

image

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో BLISC పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 12వ తేదీ నుంచి ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించినప్పటికీ వివిధ కారణాల రీత్యా వాయిదా వేసినట్లు చెప్పారు. ఈ పరీక్షల తేదీలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్, స్టడీ సెంటర్లలో సంప్రదించాలని సూచించారు.