News July 10, 2025

పర్వతగిరి: హే మహాత్మా.. శిథిలావస్థకు గాంధీ విగ్రహం..!

image

పర్వతగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన విగ్రహం ఎవరూ పట్టించుకోకపోవడంతో సిమెంట్ పెచ్చులూడి లోపల ఉన్న ఇనుప చువ్వలు బయటకు తేలుతున్నాయి. ప్రధాన కూడలిలో గాంధీ విగ్రహం శిథిలావస్థకు చేరి కనిపిస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం విడ్డూరం. పలువురు గ్రామస్థులు శిథిలావస్థకు చేరిన విగ్రహాన్ని చూసి “హే మహాత్మా” అని వాపోతున్నారు.

Similar News

News February 17, 2026

రీ-సర్వే వేగవంతం చేయాలి: కలెక్టర్

image

వరంగల్ జిల్లాలో నక్షలు లేని గ్రామాల్లో భూముల రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రీ-సర్వే పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై విస్తృతంగా చర్చించారు. నక్షలు లేని గ్రామాల్లో భూసర్వే ఖచ్చితత్వంతో పూర్తి చేసి, భూ వివాదాలకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.

News February 17, 2026

వరంగల్ జిల్లాలో 47.79% మ్యాపింగ్ పూర్తి: కలెక్టర్

image

వరంగల్, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) మ్యాపింగ్ ప్రక్రియ 47.79 శాతం పూర్తయిందని కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో వరంగల్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ డా.సత్య శారద పాల్గొన్నారు.

News February 17, 2026

వరంగల్ జిల్లాలో నూతన సర్పంచులకు శిక్షణ

image

గ్రామాల సర్వతోముఖాభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. దేశంలోనే ఆదర్శ గ్రామంగా గుర్తింపు పొందిన గంగదేవిపల్లి గ్రామంలో వరంగల్ జిల్లాలోని 11 మండలాలకు చెందిన నూతన సర్పంచుల కోసం నాలుగు విడతలుగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. గ్రామాలకు నిజమైన అభివృద్ధి తీసుకురావాలంటే సర్పంచులు పంచాయతీ రాజ్ చట్టం-2018పై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని ఆమె సూచించారు.