News July 10, 2025

సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై నేడు క్లారిటీ!

image

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన ఇవాళ క్యాబినెట్ మీటింగ్ జరగనుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. దీంతో పాటు రేషన్ కార్డుల పంపిణీ, బనకచర్ల ప్రాజెక్టు వివాదం, రాజీవ్ యువవికాసం పథకం అమలు ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు 18 సార్లు మంత్రివర్గ సమావేశాలు జరగ్గా 300కు పైగా అంశాలపై చర్చించారు.

Similar News

News July 11, 2025

జులై 11: చరిత్రలో ఈరోజు

image

1877: హైదరాబాద్ ఇంజినీర్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జననం
1907: సినీ నటుడు సీఎస్ఆర్ ఆంజనేయులు జననం
1964: సంగీత దర్శకుడు మణిశర్మ జననం
1987: 500 కోట్లకు చేరిన ప్రపంచ జనాభా. (జనాభా దినోత్సవం మొదలు)
2007: సినీనటుడు ‘ముత్యాల ముగ్గు’ శ్రీధర్ మరణం
* తెలంగాణ ఇంజినీర్ల దినోత్సవం

News July 11, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 11, 2025

100 ఏళ్లైనా AI అలా చేయలేదు: బిల్ గేట్స్

image

AIపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ప్రోగ్రామింగ్‌లో AI మనకు అసిస్టెంట్‌గా వ్యవహరిస్తుంది. డీబగ్గింగ్‌ లాంటి విషయాల్లో హెల్ప్ చేస్తుంది. ప్రోగ్రామింగ్‌లో సృజనాత్మకంగా వ్యవహరించాలి, ఊహాత్మక ఆలోచన, పరిస్థితులకు తగ్గట్లుగా సర్దుబాటు అవసరం వాటిని యంత్రాలు చేయలేవు. అందుకే, ఎప్పటికీ AI డెవలప్పర్లకు పూర్తి ప్రత్యామ్నాయం కాదు’ అని వ్యాఖ్యానించారు.