News July 10, 2025
జగన్ పర్యటనపై మూడు కేసుల నమోదు

జగన్ బంగారపాళ్యం పర్యటనలో మూడు పోలీసు కేసులు నమోదయ్యాయి. నిబంధనలు ఉల్లంఘించి రోడ్డు షో చేశారంటూ పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, నాయకులు కుమార్ రాజా, పాలేరు రామచంద్రారెడ్డిపై కేసు పెట్టారు. రోడ్డుపై మామిడి కాయలు పోసిన డ్రైవర్లపై మరో కేసు నమోదు కాగా ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై దాడి చేసినట్లు మరోకేసు పెట్టారు.
Similar News
News July 11, 2025
NZB: జనాభా నియంత్రణకు కృషి చేయండి: DM& HO

జనాభా నియంత్రణకు సిబ్బంది కృషి చేయాలని నిజామాబాద్ DM&HO డాక్టర్ బి.రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించే కార్యక్రమాలపై వివిధ PHCల వైద్యాధికారులతో గురువారం జిల్లాస్థాయి సన్నాక సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో DM&HO మాట్లాడుతూ తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతుల పట్ల ప్రజల్లో అవగాహణ కల్పించాలని సూచించారు.
News July 11, 2025
కొమురవెల్లి మల్లన్న ఆదాయం రూ.1,04,35,711

కొమురవెల్లి మల్లికార్జున స్వామి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు గురువారం లెక్కించారు. స్వామి వారికి 55 రోజుల్లో రూ.1,04,35,711 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి అన్నపూర్ణ తెలిపారు. 120 గ్రాముల మిశ్రమ బంగారం, 6.100 కిలోల మిశ్రమ వెండి, 42 విదేశీ నోట్లు, మిశ్రమ బియ్యం 16 క్వింటాలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, పోలీస్ సిబ్బంది, SBI బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
News July 11, 2025
మద్దూర్: పురుగుమందు తాగి మహిళ ఆత్మహత్య

ఓ మహిళ పురుగుమందు తాగి మృతి చెందిన ఘటన మద్దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధమగ్నాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ విజయ్ తెలిపిన వివరాలు.. ఈనెల 8వ తేదీన గ్రామానికి చెందిన జోగు మౌనిక ఆర్థిక(35) ఇబ్బందులతో పురుగుమందు తాగింది. చికిత్స కుటుంబసభ్యులు నిమిత్తం HYD నిమ్స్‌కి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. ఈమేరకు కేసు నమోదైంది.