News March 30, 2024

తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడండి: సీఎం

image

TG: వేసవి నేపథ్యంలో విద్యుత్, తాగునీటి అవసరాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రిజర్వాయర్లలో సరిపడా నీరుందని, నిరంతర నీటి సరఫరాపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని, వృథాపై ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం సూచించారు.

Similar News

News January 14, 2026

ఇంట్రెస్టింగ్ మ్యాచ్.. ఎవరు గెలుస్తారో?

image

భారత్-న్యూజిలాండ్ రెండో వన్డే ఆసక్తికరంగా సాగుతోంది. 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 28 ఓవర్లలో 134/2 రన్స్ చేసింది. మిచెల్, యంగ్ హాఫ్ సెంచరీలు చేశారు. న్యూజిలాండ్ విజయానికి మరో 132 బంతుల్లో 151 రన్స్ అవసరం. ప్రసిద్ధ్, హర్షిత్ ఒక్కో వికెట్ పడగొట్టారు. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

News January 14, 2026

ఆమెకి రెండు యోనులు, రెండు గర్భాశయాలు

image

పుట్టుకతో రెండు యోనులు, రెండు గర్భాశయాలతో జన్మించిన యూపీలోని బల్లియా(D) యువతికి లక్నో వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు. ఆమెకి చిన్నప్పటి నుంచి మూత్ర విసర్జనపై నియంత్రణ ఉండేది కాదని, మలవిసర్జనలోనూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు డాక్టర్లు తెలిపారు. మూత్ర నాళాలు అసాధారణ ప్రదేశాలలో తెరుచుకోవడంతో మూత్రం లీక్ అయ్యేదని పేర్కొన్నారు. 3 సర్జరీలు చేసి ఈ అరుదైన సమస్యను పరిష్కరించారు.

News January 14, 2026

జర్నలిస్టుల అరెస్టును ఖండిస్తున్నా: జగన్

image

హైదరాబాద్‌లో NTV జర్నలిస్టుల <<18856335>>అరెస్టును<<>> YCP అధినేత జగన్ ఖండించారు. ‘పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలపై ఇది ప్రత్యక్ష దాడి. అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి, నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం శోచనీయం. జర్నలిస్టులు ఉగ్రవాదులు కాదు. ఇలాంటి చర్యలు మీడియాలో భయాన్ని సృష్టిస్తాయి. ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించాలి. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు.