News July 10, 2025
స్మార్ట్ ఫోన్లపై బిగ్ డిస్కౌంట్స్!

తమ దగ్గర ఉన్న స్టాక్‌ను తగ్గించుకునేందుకు స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందించాలని వివిధ బ్రాండ్లు ఆలోచిస్తున్నట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ తెలిపారు. ఈ ఏడాది తొలి 6 నెలల్లో సేల్స్ పడిపోవడంతో వచ్చే ఆగస్టు 15, రాఖీ, దీపావళికి స్టాక్ క్లియర్ చేయాలని భావిస్తున్నాయి. వన్‌ప్లస్, షియోమీ, ఐకూ, రియల్‌మీ, ఒప్పో, నథింగ్ బ్రాండ్ల వద్ద స్టాక్ ఎక్కువ ఉండడంతో డిస్కౌంట్లు ఇవ్వొచ్చు.
Similar News
News July 11, 2025
జులై 11: చరిత్రలో ఈరోజు

1877: హైదరాబాద్ ఇంజినీర్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జననం
1907: సినీ నటుడు సీఎస్ఆర్ ఆంజనేయులు జననం
1964: సంగీత దర్శకుడు మణిశర్మ జననం
1987: 500 కోట్లకు చేరిన ప్రపంచ జనాభా. (జనాభా దినోత్సవం మొదలు)
2007: సినీనటుడు ‘ముత్యాల ముగ్గు’ శ్రీధర్ మరణం
* తెలంగాణ ఇంజినీర్ల దినోత్సవం
News July 11, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News July 11, 2025
100 ఏళ్లైనా AI అలా చేయలేదు: బిల్ గేట్స్

AIపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ప్రోగ్రామింగ్‌లో AI మనకు అసిస్టెంట్‌గా వ్యవహరిస్తుంది. డీబగ్గింగ్ లాంటి విషయాల్లో హెల్ప్ చేస్తుంది. ప్రోగ్రామింగ్‌లో సృజనాత్మకంగా వ్యవహరించాలి, ఊహాత్మక ఆలోచన, పరిస్థితులకు తగ్గట్లుగా సర్దుబాటు అవసరం వాటిని యంత్రాలు చేయలేవు. అందుకే, ఎప్పటికీ AI డెవలప్పర్లకు పూర్తి ప్రత్యామ్నాయం కాదు’ అని వ్యాఖ్యానించారు.