News July 10, 2025

టోకెన్లు లేని భక్తులకు 20 గంటల సమయం

image

AP: తిరుమల శ్రీవారి దర్శనం కోసం 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని వారికి సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. నిన్న 76,501 మంది స్వామివారిని దర్శించుకోగా, 29,033 మంది తలనీలాలు సమర్పించారు. హుండీకి రూ.4.39 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది.

Similar News

News July 11, 2025

అరుదైన ఘనత.. వరుస ఓవర్లలో 2 హ్యాట్రిక్స్

image

ENG సఫోల్క్ కౌంటీకి చెందిన కిశోర్ కుమార్ సాధక్ అనే 37 ఏళ్ల స్పిన్నర్ రేర్ ఫీట్ సాధించారు. UKలోనీ టూ కౌంటీస్ ఛాంపియన్‌షిప్‌లో కెస్‌గ్రేవ్‌తో జరిగిన డివిజన్ మ్యాచ్‌లో వరుసగా 2ఓవర్లలో 2హ్యాట్రిక్స్ నమోదు చేశారు. ఇప్స్‌విచ్ & కోల్చెస్టర్ తరఫున బరిలోకి దిగిన సాధక్ 6 ఓవర్లేసి 20 రన్స్ ఇచ్చి ఆరుగురిని అవుట్ చేశారు. వారిలో ఐదుగురు డకౌట్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో సాధక్ జట్టు 7వికెట్ల తేడాతో గెలిచింది.

News July 11, 2025

రష్మిక విలన్ రోల్ చేస్తోందా?

image

అల్లు అర్జున్-అట్లీ మూవీలో రష్మిక నటిస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో ఐదుగురు హీరోయిన్లని, అందులో రష్మిక ఒకరని సినీటౌన్‌లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే దీపికను హీరోయిన్‌గా పరిచయం చేశారు. మృణాల్ కూడా షూటింగ్‌లో పాల్గొన్నారని చెబుతున్నారు. మిగిలిన 3 పాత్రల్లో రష్మిక, జాన్వీ, భాగ్యశ్రీ పేర్లు వినిపిస్తున్నాయి. రష్మిక పాత్రలో కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని, యాక్షన్ సీన్సూ చేస్తారని సమాచారం.

News July 11, 2025

నాకు ప్రాణ హాని ఉంది: ట్రంప్

image

ట్రంప్‌పై ఏ క్షణమైనా దాడి జరగొచ్చని ఇరాన్ సీనియర్ అధికారి <<17014894>>జావద్ లారిజనీ<<>> చేసిన హెచ్చరికలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ‘జావద్ లారిజనీ హెచ్చరికలను బెదిరింపులుగానే భావిస్తున్నాను. నా ప్రాణాలకు హాని ఉంది అనే వార్తల్లో సందేహం లేదు. నిజానికి నేను ఏడేళ్ల వయసు నుంచే సన్ బాత్ చేయడం మానేశాను’ అని వ్యాఖ్యానించారు. ఆ సమాధానం చూస్తే ఇరాన్ హెచ్చరికలను ట్రంప్ తేలిగ్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది.