News March 30, 2024
HYD: OYO హోటల్‌లో యువతిపై అత్యాచారం

HYDలో దారుణఘటన వెలుగుచూసింది. KPHBలోని ఓ హాస్టల్‌లో ఉండే యువతి(22)కి 8 నెలల క్రితం డెలివరీ బాయ్ ఒబెదుల్లాఖాన్(23)తో స్నేహం ఏర్పడింది. MAR 28న డిన్నర్ చేద్దామని చెప్పి అమ్మాయిని జూబ్లీహిల్స్‌లోని OYOకి తీసుకెళ్లాడు. హోటల్‌లోనే మద్యం తాగి అక్కడే నిద్రపోయారు. మత్తులో ఉన్న ఆమెపై ఒబెదుల్లాఖాన్ అత్యాచారం చేశాడు. శుక్రవారం యువతి PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
Similar News
News July 6, 2025
ఖైరతాబాద్: లైసెన్స్ రెన్యూవల్‌కు దూరం.. దూరం !

గ్రేటర్‌లో ఏ వ్యాపారం నిర్వహించాలన్నా GHMC ట్రేడ్ లైసెన్స్ కచ్చితంగా ఉండి తీరాలి. దీనిని ప్రతి సంవత్సరం డిసెంబర్ 31లోగా రెన్యూవల్ చేయించాలి. అయితే ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలో 10వేల వ్యాపార సంస్థలు ఉంటే 4వేల మంది, జూబ్లిహిల్స్ సర్కిల్‌లో 15వేల మంది వ్యాపారులు ఉంటే 7వేల మంది మాత్రమే తమ ట్రేడ్ లైసెన్సులు పునరుద్ధరించుకున్నారు. ఏడు నెలలు దాటుతున్నా లైసెన్సు రెన్యూవల్ గురించి వ్యాపారులు ఆలోచించడం లేదు.
News July 6, 2025
HYD: గ్రేటర్లో 4 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు

గ్రేటర్ HYD పరిధిలో మొత్తం 4 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క కేంద్రానికి సుమారు ఎకరా స్థలం అవసరం ఉందని, ప్రస్తుతం స్థలాల ఎంపిక కొనసాగుతుందని, అనువైన స్థలం దొరకని కారణంగా లేట్ అవుతున్నట్లు సంయుక్త రవణ శాఖ కమిషనర్ రమేశ్ తెలిపారు. దీంతో రోడ్డుపై వాహనం ఎక్కాలంటే ఈ ఆటోమేటిక్ స్టేషన్లలో చెకింగ్ చేయాల్సి ఉంటుంది.
News July 6, 2025
GHMC: అసలు మనకెన్ని ఆస్తులున్నాయి..?

GHMCకి అసలు స్థిరాస్తులు ఎన్ని ఉన్నాయో అధికారులకు అంతుపట్టడం లేదు. దీంతో గ్రేటర్ పరిధిలోని ఆస్తులను సర్వే చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆ మేరకు సర్వే చేయడానికి కన్సల్టెంట్లను టెండర్లకు ఆహ్వానించారు. నాలుగు జోన్లలో దాదాపు 1400 స్థిరాస్తులు ఉన్నాయని రికార్డుల్లో ఉంది. ఎక్కడెక్కడ, ఏఏ ఆస్తులు ఉన్నాయో త్వరలో సర్వే చేసి మొత్తం ఆస్తి వివరాలు తెలుసుకోనున్నారు.