News July 10, 2025
హుస్నాబాద్: బాత్‌రూంలో పడి గీతకార్మికుడు మృతి

అక్కన్నపేటకు చెందిన మాటూరి సదానందం బాత్‌రూంలో ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ఎస్సై చాతరాజు ప్రశాంత్ వివరాలు.. గతనెల 19న తాటిచెట్టుపై నుంచి కాలుజారి పడిపోయిన సదానందం, WGLలోని ఆస్పత్రిలో చికిత్స పొంది ఈనెల 5న ఇంటికి వచ్చారు. బుధవారం ఇంట్లోని బాత్‌రూంలో కాలుజారి మళ్ళీ కిందపడ్డాడు. హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Similar News
News July 11, 2025
గూడూరు: వృద్ధురాలిని కన్న కొడుకులకు అప్పగించిన పోలీసులు

గూడూరు మండలం భూపతి పేటలో వృద్ధురాలు భద్రమ్మను కన్న కొడుకులు రైతు వేదిక వద్ద వదిలేసిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న పోలీసులు స్థానిక ఎస్సై గిరిధర్ రెడ్డి ఆదేశాలతో భద్రమ్మ కన్న కొడుకులను హెచ్చరించారు. పోలీసుల కౌన్సిలింగ్‌తో కన్నతల్లిని తీసుకెళ్లడానికి కొడుకులు ఒప్పుకున్నారు. మళ్లీ ఇలాంటి ఘటన పునరావృతం అయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
News July 11, 2025
శుభాంశు శుక్లా తిరుగు పయనం వాయిదా

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ కెప్టెన్, వ్యోమగామి శుభాంశు శుక్లా తిరుగు పయనం వాయిదా పడింది. <<16831702>>యాక్సియం-4<<>> మిషన్‌లో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లిన నలుగురు సభ్యులు ఈ నెల 14న భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉందని నాసా తెలిపింది. 14 రోజుల యాత్ర కోసం జూన్ 25న ఈ మిషన్ చేపట్టిన విషయం తెలిసిందే. కాగా ఇవాళే వారు తిరిగి రావాల్సి ఉండగా వాయిదా పడింది. స్పష్టమైన కారణాలేంటో నాసా వెల్లడించలేదు.
News July 11, 2025
నంద్యాల: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్లు జైలు శిక్ష

చాగలమర్రి మండలం ముత్యాలపాడుకు చెందిన కొండబోయిన చిన్న ఎల్లయ్యకు 20 ఏళ్లు జైలుశిక్ష, రూ.50 వేలు జరిమానా విధిస్తూ కర్నూలు పోక్సో కోర్టు సెషన్స్ జడ్జి తీర్పు ఇచ్చినట్లు నంద్యాల జిల్లా పోలీసులు తెలిపారు. 2021 జనవరిలో గ్రామానికి చెందిన ఓ బాలికపై ఎల్లయ్య అత్యాచారానికి పాల్పడ్డాడని కేసు నమోదు చేశారు. సాక్ష్యాధారాలు రుజువు కావడంతో జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.