News July 10, 2025

PDPL: జిల్లాలో బోడ కాకరకాయ కిలో ₹ 240

image

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూరగాయల మార్కెట్‌లలో బోడ కాకరకాయ ధర కిలో ₹ 240కి చేరింది. ఆరోగ్యానికి అన్ని రకాల పోషకాలు అందించే బోడ కాకరకాయ అంటే అందరికీ ఇష్టమే. ఈ సీజన్ ప్రారంభంలోనే కిలో ₹ 200 పైన ధర పలకడంతో వినియోగదారులు వామ్మో అంటున్నారు. కిలో చికెన్ ధరకు సరి సమానంగా మారింది. ధర ఎక్కువే అయినప్పటికీ బోడ కాకరకాయ కొనుక్కునేందుకు ప్రజలు మక్కువ కనబరుస్తున్నారు.

Similar News

News July 11, 2025

నంద్యాల: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్లు జైలు శిక్ష

image

చాగలమర్రి మండలం ముత్యాలపాడుకు చెందిన కొండబోయిన చిన్న ఎల్లయ్యకు 20 ఏళ్లు జైలుశిక్ష, రూ.50 వేలు జరిమానా విధిస్తూ కర్నూలు పోక్సో కోర్టు సెషన్స్ జడ్జి తీర్పు ఇచ్చినట్లు నంద్యాల జిల్లా పోలీసులు తెలిపారు. 2021 జనవరిలో గ్రామానికి చెందిన ఓ బాలికపై ఎల్లయ్య అత్యాచారానికి పాల్పడ్డాడని కేసు నమోదు చేశారు. సాక్ష్యాధారాలు రుజువు కావడంతో జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.

News July 11, 2025

సంగారెడ్డి: ఈ తేదీల్లో సదరం శిబిరాలు

image

జులై నెలకు సంబంధించిన దివ్యాంగుల యూడీఐడీ (సదరం) ఈ నెల 16, 23, 30 తేదీల్లో క్యాంపు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి గాయత్రి దేవి గురువారం తెలిపారు. కావున జిల్లాలోని దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మీ సేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్న దివ్యాంగులు మాత్రమే శిబిరానికి హాజరు కావాలని కోరారు.

News July 11, 2025

NZB: జనాభా నియంత్రణకు కృషి చేయండి: DM& HO

image

జనాభా నియంత్రణకు సిబ్బంది కృషి చేయాలని నిజామాబాద్ DM&HO డాక్టర్ బి.రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించే కార్యక్రమాలపై వివిధ PHCల వైద్యాధికారులతో గురువారం జిల్లాస్థాయి సన్నాక సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో DM&HO మాట్లాడుతూ తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతుల పట్ల ప్రజల్లో అవగాహణ కల్పించాలని సూచించారు.