News March 30, 2024
బంగారం కోసం వివాహిత హత్య: డీసీపీ రవీందర్
దుగ్గొండి మండలం మైసంపల్లిలో సుప్రియ హత్య ఘటనలో పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నర్సంపేటలోని రూరల్ పోలీస్ స్టేషన్ లో ఇందుకు సంబంధించిన వివరాలను డీసీపీ రవీందర్ వెల్లడించారు. ములుగుకు చెందిన శశికాంత్, అజ్మీర శిరీష సహజీవనం చేస్తున్నారు. వీరి విషయం తెలిసిన మృతురాలు సుప్రియతో శిరీష గొడవ పడింది. ఈనెల 23న సుప్రియను కొట్టి హత్యచేసి బంగారం, వెండిని తీసుకొని పరారయ్యారని తెలిపారు.
Similar News
News January 13, 2025
వరంగల్: రాష్ట్ర ప్రజలకు మంత్రి సురేఖ సూచనలు
తెలంగాణ ప్రజలందరికీ మంత్రి కొండా సురేఖ భోగి పండగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భోగ భాగ్యాలు, సిరి సంపదలతో సమృద్ధిగా వర్ధిల్లాలని మంత్రి ఆకాంక్షించారు. పతంగులు ఎగురవేసే సమయంలో యువత, పిల్లలు, వారి తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గాలిపటాలకు చైనా మాంజాను వాడొద్దని సూచించారు.
News January 13, 2025
ఉమ్మడి వరంగల్ జిల్లాలో టాప్ న్యూస్
> WAY2NEWSతో వర్ధన్నపేట MLA నాగరాజు > గట్టమ్మ ఆలయం వద్ద భక్తుల సందడి > HNK: పథకాలపై మంత్రి పొంగులేటి సమీక్ష > MHBD: అభివృద్ధికి కాంగ్రెస్ కృషి చేస్తుంది: ప్రభుత్వ విప్ > MLG: నెల రోజుల్లో మేడారం జాతర > JN: జిల్లా వ్యాప్తంగా ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు > ఐనవోలు: భక్తులకు అసౌకర్యం కలగకుండా: MLA నాగరాజు
News January 12, 2025
ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన భద్రకాళీ అమ్మవారు
వరంగల్ లోని ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళీ అమ్మవారు ఈరోజు ఆదివారం సందర్భంగా ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు వితరణ చేశారు.