News July 10, 2025
NLG: సాగునీటి కోసం ఆయకట్టు ఎదురుచూపు!

సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టులో వరినారు పోసుకునేందుకు నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. సాగర్ జలాశయంలో 540 అడుగుల మేరకు నీరున్నప్పుడు.. ఎగువ నుంచి వరద కొనసాగుతున్న సమయంలో గతంలో ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. కాగా ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో నీటిని విడుదల చేయాలని కోరారు. అయితే, కాల్వలకు సాగునీటి విడుదలపై 14న సమీక్ష చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Similar News
News September 10, 2025
NLG: 15 వరకు ఇగ్నో ప్రవేశాల గడువు

IGNOUలో జూలై-2025 సెషన్‌కు సంబంధించిన ప్రవేశాలకు చివరితేదీ ఈ నెల 15 వరకు ఉందని ఇగ్నో HYD ప్రాంతీయ కేంద్రం డీడీ డా.రాజు బొల్లా తెలిపారు. మాస్టర్, డిగ్రీ, పీజీడిప్లొమా, డిప్లొమా వంటి వివిధ ప్రోగ్రాములకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.ignou.ac.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News September 10, 2025
NLG: ఈ నెల 15న ఎంజీయూకు గవర్నర్

ఈ నెల 15న మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నాలుగో స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి విశ్వవిద్యాలయాన్ని సందర్శించి, గవర్నర్ పాల్గొననున్న వేదికను పరిశీలించారు.
News September 10, 2025
NLG: ఏటేటా తగ్గుతున్న కూరగాయల సాగు

జిల్లాలో కూరగాయల సాగు ఏటేటా తగ్గుముఖం పడుతోంది. ఎక్కువ శాతం MNGD, DVK, సాగర్, NKL నియోజకవర్గాల్లో కూరగాయల సాగు ఎక్కువగా చేపడుతున్నారు. సాగు గిట్టుబాటుకాకపోవడం, ప్రభుత్వం రాయితీలు కల్పించకపోవడం, మార్కెటింగ్ సదుపాయం లేకపోవడం, దళారులు రంగప్రవేశం చేయడం వంటి కారణాలతో రైతుల్లో ఆసక్తి తగ్గుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఐదేళ్ల క్రితం 42 వేల ఎకరాల్లో కూరగాయలు సాగయ్యేవి. ప్రస్తుతం 80 శాతం సాగు పడిపోయింది.