News July 10, 2025
పిఠాపురం: పవన్ కళ్యాణ్ మంచి మనసు

పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ చిన్నారులకు అండగా ఉంటానని ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన హామీని నిలబెట్టుకుంటున్నారు. వరుసగా రెండో నెల కూడా తన జీతాన్ని చిన్నారుల సంక్షేమానికి కేటాయించారు. నియోజకవర్గంలోని 46 మంది పిల్లలకు ఒక్కొక్కరికీ రూ.5,000 చొప్పున మొత్తం రూ. 2.30 లక్షలను పంపిణీ చేయించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి్ మర్రెడ్డి శ్రీనివాస్ చిన్నారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి ఈ నగదును అందజేశారు.
Similar News
News July 11, 2025
తుని: రైలు ఢీకొని వ్యక్తి మృతి

తుని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని సుమారు 40 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. నర్సీపట్నం రోడ్డు, స్టేషన్ యార్డ్ సమీపంలో విశాఖపట్నం వైపు వెళ్తున్న రైలు ఢీకొంది. మృతుడి ఎడమ చేతిపై MIRSO అనే పచ్చబొట్టు ఉందని ఎస్ఐ తెలిపారు.
News July 11, 2025
విశాఖలో ఈసాయ్ సంస్థ విస్తరణ

విశాఖపట్నంలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఈసాయ్ ఫార్మాస్యూటికల్స్ నిర్ణయించింది. 2026 ఫిబ్రవరి నాటికి ఈ కేంద్రం పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇప్పటికే జేఎన్ ఫార్మా సిటీలో తయారీ ప్లాంట్‌ను నిర్వహిస్తున్న ఈసాయ్ సంస్థ ఈ కొత్త కేంద్రంతో భారత్‌లో తన ఉనికిని మరింతగా బలోపేతం చేయనుంది.
News July 11, 2025
షీలానగర్‌లో యాక్సిడెంట్.. ఒకరి మృతి

షీలానగర్ సమీపంలోని మారుతి సర్కిల్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పరవాడకు చెందిన అశోక్ రెడ్డి బైకుపై వెళుతుండగా ట్రాలర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎయిర్ పోర్ట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గతంలో కూడా ఇదే ఏరియాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు.