News July 10, 2025

WGL: మక్కలు బిల్టీ క్వింటా రూ.2,430

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి గురువారం వివిధ రకాల చిరుధాన్యాల ఉత్పత్తులు తరలివచ్చాయి. ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు బిల్టీ క్వింటా రూ.2,430 పలకగా.. పసుపు రూ. 12,259 ధర పలికింది. అలాగే సూక పల్లికాయకి ధర రూ.5,800 రాగా.. పచ్చి పల్లికాయకి రూ.3,600 ధర వచ్చిందని అధికారులు తెలిపారు. .

Similar News

News September 7, 2025

వరంగల్ జిల్లాలో వర్షపాతం ఇలా..!

image

వరంగల్ జిల్లావ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి కురిసిన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. ఖిలా వరంగల్ ప్రాంతంలో 56 మి.మీ వర్షపాతం నమోదు కాగా.. గీసుకొండలో 38, దుగ్గొండి, సంగెం, నల్లబెల్లిలో 20 మి.మీ వర్షపాతం రికార్డయింది. వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో వర్షం కురువలేదని, చెన్నారావుపేట, నర్సంపేట, పర్వతగిరిలో ఓ మోస్తరుగా వాన పడింది.

News September 6, 2025

నిమజ్జనాన్ని పరిశీలించిన వరంగల్ కలెక్టర్

image

నర్సంపేటలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని వరంగల్ కలెక్టర్ సత్య శారద శుక్రవారం రాత్రి పరిశీలించారు. పట్టణ శివారు దామర చెరువు వద్ద కొనసాగుతున్న నిమజ్జనాన్ని పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. ఎన్ని విగ్రహాలు, ఏర్పాట్లు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఏసీపీ, ఆర్డీవో ఉమరాణి, మున్సిపల్ కమిషనర్ భాస్కర్, తదితరులున్నారు.

News September 5, 2025

వరంగల్: రేషన్ షాపుల బంద్ సక్సెస్..!

image

రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రేషన్ షాపుల ఒకరోజు బంద్ కార్యక్రమం వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. 29 ప్రభుత్వం నిర్వహించే షాపులు మినహా మిగతా షాపులన్నీ స్వచ్ఛందంగా మూసివేశారు. రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించకపోతే త్వరలోనే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ధారావత్ మోహన్ నాయక్ అన్నారు.