News July 10, 2025
ఎన్నికల సంఘానికి సుప్రీం కీలక ఆదేశాలు

బిహార్‌లో ఓటర్ల జాబితాకు సంబంధించి ఎన్నికల సంఘం(ECI) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌కు ఆధార్, ఓటర్ ID, రేషన్ కార్డులనూ పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సిటిజన్‌షిప్ నిర్ధారణకు JUN 24న ECI సబ్మిట్ చేసిన 11రకాల డాక్యుమెంట్లు కూడా సమగ్రమైనవి కాదంది. సిటిజన్‌షిప్ నిర్ధారించాల్సింది ECI కాదని పేర్కొంది. JUL 21లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలంది. విచారణను JUL 28కి వాయిదా చేసింది.
Similar News
News July 11, 2025
ఈ నెల 15న ముంబైలో టెస్లా షోరూం ప్రారంభం!

ఎలాన్ మస్క్‌కు చెందిన ఈవీ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్‌లో కార్యకలాపాలకు సిద్ధమైంది. ఈ నెల 15న ముంబైలోని బాంద్రాలో ఆ కంపెనీ తొలి షోరూంను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కార్లు ముంబైకి చేరుకున్నాయని జాతీయ మీడియా పేర్కొంది. 2021 నుంచే టెస్లా భారత మార్కెట్‌లో ప్రవేశించాలని ప్రయత్నించినా కంపెనీ ఏర్పాటు చేయాలన్న భారత్ కండిషన్లతో ఆలస్యమైంది. కాగా ఢిల్లీలోనూ షోరూంను ప్రారంభిస్తారని సమాచారం.
News July 11, 2025
శ్రీశైలం నీళ్లు ఎలా వాడుకుంటారో తెలుసా?

శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమ, తెలంగాణకు నీరందుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44వేల క్యూసెక్కులను రాయలసీమకు తరలించొచ్చు. తెలుగు గంగ, గాలేరు-నగరి కాలువల ద్వారా కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు నీరందుతోంది. హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకంతో అనంతపురం, చిత్తూరుకు నీరు వెళ్తోంది. అటు తెలంగాణ కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా లబ్ధి పొందుతోంది.
News July 11, 2025
ఇలా చేస్తే మీ ఆధార్ వివరాలు సేఫ్: UIDAI

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకునేందుకు బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం <