News July 10, 2025
జగిత్యాల: ఎన్నికలకు సిద్ధం కండి: RS ప్రవీణ్ కుమార్

BRS నేతలు, కార్యకర్తలు జోష్ పెంచాలని, ప్రతి గ్రామంలో ముమ్మరంగా పర్యటించాలని, ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు RS ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో BRS కొత్త ఆఫీస్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, MLA కల్వకుంట్ల సంజయ్ కుమార్, BRS నాయకులు పాల్గొన్నారు.
Similar News
News July 11, 2025
ఈ నెల 15న ముంబైలో టెస్లా షోరూం ప్రారంభం!

ఎలాన్ మస్క్‌కు చెందిన ఈవీ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్‌లో కార్యకలాపాలకు సిద్ధమైంది. ఈ నెల 15న ముంబైలోని బాంద్రాలో ఆ కంపెనీ తొలి షోరూంను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కార్లు ముంబైకి చేరుకున్నాయని జాతీయ మీడియా పేర్కొంది. 2021 నుంచే టెస్లా భారత మార్కెట్‌లో ప్రవేశించాలని ప్రయత్నించినా కంపెనీ ఏర్పాటు చేయాలన్న భారత్ కండిషన్లతో ఆలస్యమైంది. కాగా ఢిల్లీలోనూ షోరూంను ప్రారంభిస్తారని సమాచారం.
News July 11, 2025
NGKL: బోరు మోటార్ వద్ద జాగ్రత్తలే రక్ష

వ్యవసాయ బోరు మోటార్ వద్ద రైతులు జాగ్రత్తగా ఉండాలి. పవర్ డబ్బాను నేరుగా తాకకుండా కర్రతో తెరవాలి. ఎందుకంటే వర్షాకాలం నేపథ్యంలో షాక్ సర్క్యూట్‌కు అవకాశం ఉంది. చల్లటి వాతావరణంతో పాములు మోటార్ డబ్బాల్లోకి ప్రవేశిస్తాయి. చేతితో తీస్తే వెంటనే కాటు వేసే ప్రమాదం ఉంది. నిన్న NGKL జిల్లా చారకొండ మండలంలో రైతు వెంకటనారి గౌడ్ మోటార్ ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. ప్రతి ప్రాణం విలువైనదే. SHARE IT
News July 11, 2025
శ్రీశైలం నీళ్లు ఎలా వాడుకుంటారో తెలుసా?

శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమ, తెలంగాణకు నీరందుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44వేల క్యూసెక్కులను రాయలసీమకు తరలించొచ్చు. తెలుగు గంగ, గాలేరు-నగరి కాలువల ద్వారా కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు నీరందుతోంది. హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకంతో అనంతపురం, చిత్తూరుకు నీరు వెళ్తోంది. అటు తెలంగాణ కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా లబ్ధి పొందుతోంది.