News March 30, 2024

రేపు జగన్ బస్సు యాత్రకు బ్రేక్

image

AP: రేపు బస్సు యాత్రకు సీఎం జగన్ విరామం ప్రకటించారు. ఈస్టర్ సందర్భంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా నాలుగు రోజుల క్రితం ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన సీఎం బస్సు యాత్ర.. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది.

Similar News

News March 14, 2026

ఒక్క రోజులో 1.34లక్షల ఇండక్షన్ స్టవ్స్ విక్రయం

image

దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా ప్రజలు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్స్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో వీటి విక్రయాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. సాధారణంగా నెలకు 1.80 లక్షల అమ్మకాలు జరిగే చోట ఒక్క రోజే అమెజాన్‌లో 1.34 లక్షలకు పైగా స్టవ్‌లు అమ్ముడయ్యాయి. ఈ అనూహ్య డిమాండ్‌ను కంపెనీలు సైతం ఊహించకపోవడంతో చాలాచోట్ల ‘అవుట్ ఆఫ్ స్టాక్’ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

News March 14, 2026

SIDBIలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

image

లఖ్‌నవూలోని స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SIDBI) 3 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, CA, CFA, MBA, PGDM అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 18 వరకు ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.sidbi.in

News March 14, 2026

జనసేన ఆవిర్భావ దినోత్సవం.. చంద్రబాబు శుభాకాంక్షలు

image

AP: జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘రాష్ట్ర అభివృద్ధిలో, తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జనసేన పోషిస్తున్న పాత్ర అభినందనీయం. ప్రజలకు అండగా నిలుస్తూ వారి భవిష్యత్ కోసం పని చేస్తున్న జనసైనికులకు, వీరమహిళలకు, నేతలకు శుభాభినందనలు’ అని ట్వీట్ చేశారు.