News July 10, 2025
సమష్టి కృషితో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన: ADB SP

బాలలు బడులకు వెళ్లే విధంగా ప్రోత్సహించాలని, పిల్లలు కార్మికులుగా ఉండరాదని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఆపరేషన్ ముస్కాన్‌పై వివిధ శాఖల అధికారులతో ఆదిలాబాద్‌లో సమావేశం నిర్వహించారు. ఆపరేషన్ ముస్కాన్ ప్రారంభమైన పది రోజుల వ్యవధిలో 37 మంది బాలల సంరక్షణ తోపాటు జిల్లావ్యాప్తంగా 10 కేసుల నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అందరి సమష్టి కృషితో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు.
Similar News
News August 31, 2025
అంకిత భావంతో సేవలందించడం అభినందనీయం : ఎస్పీ

ఏఎస్ఐ ఎస్.దిలీప్ (తాంసి, పీఎస్), ఏఎస్ఐ ముంతాజ్ అహ్మద్ (భీంపూర్ పీఎస్) పదవీ విరమణ పొందిన సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం వారిని సన్మానించారు. 35 ఏళ్లకు పైగా పోలీసు సర్వీసులో చిన్న రిమార్క్ కూడా లేకుండా ఇద్దరూ అంకితభావంతో సేవలందించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, ఏఎస్ఐల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
News August 31, 2025
జానపద దినోత్సవాల్లో ADB కళాకారులు

HYDలోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో నిర్వహించిన ప్రపంచ జానపద దినోత్సవ సంబరాల్లో ఆదివారం బాలకేంద్రం చిన్నారులు పాల్గొన్నారు. ఎల్లమ్మ బోనాల పాటపై నృత్య ప్రదర్శన చేసి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చిన్నారుల ప్రదర్శనకు నిర్వాహకులు జ్ఞాపికలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కార్యదర్శులు శ్రీనివాస్ గౌడ్, లింగన్న తదితరులు పాల్గొన్నారు.
News August 31, 2025
నేడు చర్లపల్లి నుంచి ADBకు ప్రత్యేక రైలు

ప్రయాణికుల సౌకర్యార్థం ఆదివారం అన్ రిజర్వుడు టీఓడీ ప్రత్యేక రైలును చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఆదిలాబాద్‌కు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ తెలిపింది. చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో రాత్రి 8:10 నిమిషాలకు రైలు బయలుదేరి సోమవారం ఉదయం 6:15 నిమిషాలకు అదిలాబాద్ స్టేషన్‌కు చేరుకుంటుందని పేర్కొంది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని రైల్వే శాఖ కోరింది.