News July 10, 2025
HYDకు వేల లీటర్ల కల్లు ఎలా వస్తోంది?

ఒక తాటి చెట్టు నుంచి గరిష్ఠంగా 4- 5 లీటర్ల కల్లు రావటమే గగనం. కానీ.. HYDలోని అనేక కల్లు కాంపౌండ్లలో రోజూ వేల లీటర్ల కల్లు విక్రయయిస్తున్నారు. ఇదంతా తయారు చేసిందే అని తాగేవారే చెబుతున్నారు. దానికి వారు ఎడిక్ట్ అయ్యి. ఒరిజిన్ కల్లు ఇచ్చినా తీసుకోరు. చాలా చోట్ల నిషేదిత కెమికల్స్, తియ్యదనానికి శాక్రిన్ కలుపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్క బీర్ సీసా (650)లో కల్లు రూ.50 ధరతో విక్రయిస్తున్నారు.
Similar News
News July 11, 2025
మెదక్: బీసీ రిజర్వేషన్.. ఆశావహుల్లో ఉత్కంఠ.!

బీసీ 42% రిజర్వేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ అంశంపై గ్రామాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సెప్టెంబరు 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని నేతల్లో రిజర్వేషన్ల భయం పట్టుకుంది. ఎక్కడ ఏ రిజర్వేషన్ వస్తుందో అని ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. MDKలో 492, SRDలో 631, SDPTలో 508 పంచాయతీలు ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయంతో BCలకు అధిక స్థానాలు దక్కనున్నాయి.
News July 11, 2025
పాలమూరు:పవన్ కళ్యాణ్ ❌ పండుగ సాయన్న

హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘<<17020927>>హరిహర వీరమల్లు<<>>’ సినిమా పండుగ సాయన్నను వక్రీకరించే విధంగా ఉందని ఉమ్మడి పాలమూరు జిల్లా బహుజన విద్యాసంఘాల నేతలు మండిపడుతున్నారు. సెన్సార్ బోర్డు తక్షణమే ఈ సినిమాకు అనుమతులు నిలిపివేయాలని, ప్రజా పోరాటంతో సినిమాను అడ్డుకుంటామన్నారు. నిన్న PUలో నిరసన వ్యక్తం చేశారు. పండుగ సాయన్న పాలమూరు వాసి. తెలంగాణ రాబిన్‌హుడ్‌గా సుపరిచితుడు. దీనిపై మీ కామెంట్?
News July 11, 2025
GNT: రాష్ట్రీయ బాల పురస్కార్‌కు ప్రతిభావంతులకు అవకాశం

విభిన్న ప్రతిభను ప్రోత్సహించేందుకు గుంటూరు జిల్లాలోని 18ఏళ్ల లోపు విద్యార్థుల నుంచి రాష్ట్రీయ బాల పురస్కార్‌కు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కళలు, క్రీడలు, పర్యావరణం, సామాజిక సేవ, తదితర రంగాల్లో సామర్థ్యం చూపిన పిల్లలు జులై 31లోగా https://awards.gov.inలో అప్లై చేయాలని జిల్లా శిశు సంక్షేమ అధికారి ప్రసూన తెలిపారు. కేంద్రం నిర్వహించే ఈ అవార్డు ప్రతిభకు గుర్తింపు కల్పించనుందన్నారు.