News July 10, 2025
కూకట్‌పల్లి: కల్తీ కల్లులో అత్యధికంగా మత్తుమందు

కల్తీ కల్లు ఘటనలో అధికారులు వివరాలు వెల్లడించారు. హైదర్‌నగర్, HMT హిల్స్, సర్దార్ పటేల్‌నగర్, భాగ్యనగర్ కాలనీలోని కల్లు కాంపౌండ్‌లోని శాంపిల్స్ సేకరించారు. భాగ్యనగర్ కాలనీ మినహా మిగతా మూడింట్లో మత్తుమందు అల్ఫాజోలం ఎక్కువగా ఉన్నట్లు నివేదిక వెల్లడించారు. నిందితులు రవితేజగౌడ్, సాయితేజగౌడ్, నగేశ్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.
Similar News
News July 11, 2025
GNT: చంద్రబాబు, లోకేశ్‌పై అంబటి ట్వీట్

వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కి చురకలంటించారు. ‘తల్లికి వందనం’ లోకేశ్ ఆలోచన. ‘ఉచిత విద్యుత్’ బాబు ఆలోచన అని చెప్తూ అమాయకపు ప్రజల్లారా నమ్మండి.!’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా అంబటి మెసేజ్‌పై టీడీపీ, వైసీపీ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పరస్పరం మాటల యుద్దం జరుగుతుంది.
News July 11, 2025
భారత వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్?

భారత వన్డే జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్‌కు గిల్ సారథ్యం వహిస్తారని రాసుకొచ్చాయి. అలాగే టీ20 వైస్ కెప్టెన్సీని కూడా అప్పగిస్తారని పేర్కొంటున్నాయి. దీనిపై ప్రస్తుత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మతో BCCI చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా గిల్ ప్రస్తుతం టెస్టు కెప్టెన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
News July 11, 2025
వర్ని: పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని తల్లి హత్య..!

వర్ని మండలంలో దారుణం జరిగింది. జలాల్పూరులో పెన్షన్ డబ్బుల కోసం కన్నతల్లినే కొడుకు హత్య చేశాడు. SI మహేశ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాయవ్వ(57)తో ఆమె కొడుకు సాయిలు పెన్షన్ డబ్బులు ఇవ్వాలని గొడవకు దిగాడు. ఈ క్రమంలో తల్లిపై కుర్చి, రాయితో దాడి చేసి పారిపోయాడు. ఆమెకు తీవ్రగాయాలు కావడంతో చుట్టుపక్కల వారు బోధన్ ఆస్పత్రికి తరలించారు. సాయవ్వను పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు.