News July 10, 2025

అమలాపురం: పేదరిక నిర్మూలనకు కలెక్టర్ ఆదేశం

image

అమలాపురంలోని కలెక్టరేట్‌లో గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘పీ4’ స్కీమ్ కింద గ్రామస్థాయి నుంచి పేదరిక నిర్మూలనకు కృషి చేయాలని కలెక్టర్ కోరారు. ‘జీరో పేదరికం’ సాధనకు అధికారులు కృషి చేయాలని విజయానంద్ దిశానిర్దేశం చేశారు. ‘బంగారు కుటుంబం’ ఎంపిక ద్వారా ఇది సాధ్యమేనని అధికారులు పేర్కొన్నారు.

Similar News

News July 11, 2025

భారత వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్?

image

భారత వన్డే జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్‌కు గిల్ సారథ్యం వహిస్తారని రాసుకొచ్చాయి. అలాగే టీ20 వైస్ కెప్టెన్సీని కూడా అప్పగిస్తారని పేర్కొంటున్నాయి. దీనిపై ప్రస్తుత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మతో BCCI చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా గిల్ ప్రస్తుతం టెస్టు కెప్టెన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

News July 11, 2025

వర్ని: పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని తల్లి హత్య..!

image

వర్ని మండలంలో దారుణం జరిగింది. జలాల్పూరులో పెన్షన్ డబ్బుల కోసం కన్నతల్లినే కొడుకు హత్య చేశాడు. SI మహేశ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాయవ్వ(57)తో ఆమె కొడుకు సాయిలు పెన్షన్ డబ్బులు ఇవ్వాలని గొడవకు దిగాడు. ఈ క్రమంలో తల్లిపై కుర్చి, రాయితో దాడి చేసి పారిపోయాడు. ఆమెకు తీవ్రగాయాలు కావడంతో చుట్టుపక్కల వారు బోధన్ ఆస్పత్రికి తరలించారు. సాయవ్వను పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు.

News July 11, 2025

మెదక్: బీసీ రిజర్వేషన్.. ఆశావహుల్లో ఉత్కంఠ.!

image

బీసీ 42% రిజర్వేషన్‌‌పై రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ అంశంపై గ్రామాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సెప్టెంబరు 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని నేతల్లో రిజర్వేషన్ల భయం పట్టుకుంది. ఎక్కడ ఏ రిజర్వేషన్ వస్తుందో అని ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. MDKలో 492, SRDలో 631, SDPTలో 508 పంచాయతీలు ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయంతో BCలకు అధిక స్థానాలు దక్కనున్నాయి.