News July 10, 2025

మేడిగడ్డ బ్యారేజీకి పెరుగుతున్న భారీ వరద

image

మేడిగడ్డ బ్యారేజీకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఉదయం 3 లక్షల క్యూసెక్కులుగా ఉన్న నీరు సాయంత్రం వరకు 6.9 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. వచ్చిన నీరును 85 గేట్లు ఓపెన్ చేసి అధికారులు గోదావరి నదికి వదులుతున్నారు. ప్రాణహిత నది నుంచి రాత్రి వరకు మరింత నీరు రానున్నట్లు తెలిపారు. బ్యారేజ్ వద్ద పోలీసులు 24 గంటలు గస్తీ కాస్తున్నారు.

Similar News

News July 11, 2025

NGKL: బోరు మోటార్ వద్ద జాగ్రత్తలే రక్ష

image

వ్యవసాయ బోరు మోటార్ వద్ద రైతులు జాగ్రత్తగా ఉండాలి. పవర్ డబ్బాను నేరుగా తాకకుండా కర్రతో తెరవాలి. ఎందుకంటే వర్షాకాలం నేపథ్యంలో షాక్ సర్క్యూట్‌కు అవకాశం ఉంది. చల్లటి వాతావరణంతో పాములు మోటార్ డబ్బాల్లోకి ప్రవేశిస్తాయి. చేతితో తీస్తే వెంటనే కాటు వేసే ప్రమాదం ఉంది. నిన్న NGKL జిల్లా చారకొండ మండలంలో రైతు వెంకటనారి గౌడ్ మోటార్ ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. ప్రతి ప్రాణం విలువైనదే. SHARE IT

News July 11, 2025

శ్రీశైలం నీళ్లు ఎలా వాడుకుంటారో తెలుసా?

image

శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమ, తెలంగాణకు నీరందుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44వేల క్యూసెక్కులను రాయలసీమకు తరలించొచ్చు. తెలుగు గంగ, గాలేరు-నగరి కాలువల ద్వారా కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు నీరందుతోంది. హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకంతో అనంతపురం, చిత్తూరుకు నీరు వెళ్తోంది. అటు తెలంగాణ కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా లబ్ధి పొందుతోంది.

News July 11, 2025

VJA: విచ్చలవిడిగా రూ.35 కోట్ల దుబారా..చివరికి.!

image

అద్విక ట్రేడింగ్ కంపెనీ నిర్వాహకుడు ఆదిత్య కేసు దర్యాప్తులో పోలీసులు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి తెస్తున్నారు. డిపాజిటర్లను ఆకర్షించేందుకు రూ.35 కోట్లకుపైగా పలు ఉత్సవాలు, పుట్టినరోజు వేడుకలు, ఖరీదైన హోటల్ రూమ్‌లలో బస ఏర్పాట్లు, టూర్‌లను కంపెనీ నిర్వాహకులు చేపట్టినట్లు తెలుస్తోంది. 11 మంది కంపెనీ డైరెక్టర్‌లకు విల్లాలు కట్టడానికి ప్రణాళిక సిద్ధం చేయగా దివాళా తీయడంతో ముందుకెళ్లలేదు.