News July 10, 2025
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ.. త్వరలో ముగియనున్న గడువు

TG: వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ (TGMBCDC) నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తోంది. 4 రోజుల పాటు సాఫ్ట్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసం, రెజ్యూమ్ తయారీ, కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనుంది. 21-30 ఏళ్ల వయసు, డిగ్రీ పాసై ఉండాలి. దరఖాస్తు గడువు ఈనెల 12తో ముగుస్తుంది. పూర్తి వివరాలకు <
Similar News
News July 11, 2025
శ్రీశైలం నీళ్లు ఎలా వాడుకుంటారో తెలుసా?

శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమ, తెలంగాణకు నీరందుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44వేల క్యూసెక్కులను రాయలసీమకు తరలించొచ్చు. తెలుగు గంగ, గాలేరు-నగరి కాలువల ద్వారా కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు నీరందుతోంది. హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకంతో అనంతపురం, చిత్తూరుకు నీరు వెళ్తోంది. అటు తెలంగాణ కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా లబ్ధి పొందుతోంది.
News July 11, 2025
ఇలా చేస్తే మీ ఆధార్ వివరాలు సేఫ్: UIDAI

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకునేందుకు బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం <
News July 11, 2025
జగన్ పర్యటన.. మొత్తం నాలుగు కేసులు నమోదు

AP: YS జగన్ చిత్తూరు(D) బంగారుపాళ్యం పర్యటనపై తాజాగా మరో కేసు నమోదైంది. అనుమతి లేకున్నా రోడ్‌షో చేపట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించి జన సమీకరణ చేపట్టారని, రోడ్డుపై మామిడికాయలు పారబోసి షరతులు ఉల్లంఘించారని, ఫొటోగ్రాఫర్‌పై జరిగిన దాడి ఘటనపై 3 వేర్వేరు కేసులు పెట్టారు. CC ఫుటేజ్, వీడియోలను పరిశీలిస్తున్న పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.