News July 10, 2025

గిరి ప్రదక్షిణ విజయవంతంలో వీరి పాత్ర కీలకం

image

సింహాచలం గిరి ప్రదక్షిణ విజయవంతంలో ప్రధానంగా 3 వర్గాల పాత్ర అత్యంత కీలకం. స్వచ్ఛంద సేవా సంస్థలు, పోలీసు, పారిశుద్ధ్య కార్మికులిది ప్రధాన భూమిక. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు తాగునీరు, ఇతర ఆహార పదార్థాలు అందజేయడంలో స్వచ్ఛంద సంస్థలు, భక్తులు రోడ్డుపై వేసే చెత్త తొలగించే పనిలో పారిశుద్ధ్య కార్మికులు, ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు విశేష కృషి చేశారు. గిరి ప్రదక్షిణ విజయవంతంలో వీరి కృషి ప్రశంసనీయం.

Similar News

News July 11, 2025

పాలమూరు:పవన్ కళ్యాణ్ ❌ పండుగ సాయన్న

image

హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘<<17020927>>హరిహర వీరమల్లు<<>>’ సినిమా పండుగ సాయన్నను వక్రీకరించే విధంగా ఉందని ఉమ్మడి పాలమూరు జిల్లా బహుజన విద్యాసంఘాల నేతలు మండిపడుతున్నారు. సెన్సార్ బోర్డు తక్షణమే ఈ సినిమాకు అనుమతులు నిలిపివేయాలని, ప్రజా పోరాటంతో సినిమాను అడ్డుకుంటామన్నారు. నిన్న PUలో నిరసన వ్యక్తం చేశారు. పండుగ సాయన్న పాలమూరు వాసి. తెలంగాణ రాబిన్‌హుడ్‌గా సుపరిచితుడు. దీనిపై మీ కామెంట్?

News July 11, 2025

GNT: రాష్ట్రీయ బాల పురస్కార్‌కు ప్రతిభావంతులకు అవకాశం

image

విభిన్న ప్రతిభను ప్రోత్సహించేందుకు గుంటూరు జిల్లాలోని 18ఏళ్ల లోపు విద్యార్థుల నుంచి రాష్ట్రీయ బాల పురస్కార్‌కు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కళలు, క్రీడలు, పర్యావరణం, సామాజిక సేవ, తదితర రంగాల్లో సామర్థ్యం చూపిన పిల్లలు జులై 31లోగా https://awards.gov.inలో అప్లై చేయాలని జిల్లా శిశు సంక్షేమ అధికారి ప్రసూన తెలిపారు. కేంద్రం నిర్వహించే ఈ అవార్డు ప్రతిభకు గుర్తింపు కల్పించనుందన్నారు.

News July 11, 2025

మేడ్చల్: ‘రేషన్ కార్డులకు E-KYC పూర్తి చేయాలి’

image

మేడ్చల్ జిల్లాలోని రేషన్ కార్డు లబ్ధిదారులు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం E-KYC పూర్తి చేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్‌రెడ్డి గురువారం తెలిపారు. జిల్లాలో మొత్తం 5,37,810 కార్డుల్లోని 18,65,353 మంది లబ్ధిదారులకుగానూ 13,19,111 (70.72%) లబ్ధిదారులు మాత్రమే E-KYC పూర్తి చేసుకున్నారని, మిగిలిన 5,46,242 (29.28%) లబ్ధిదారులు E-KYC పూర్తి చేసుకోవాలని సూచించారు.