News July 10, 2025

BRAOUలో ఏ పరీక్షలు వాయిదా అంటే!

image

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో BLISC పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 12వ తేదీ నుంచి ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించినప్పటికీ వివిధ కారణాల రీత్యా వాయిదా వేసినట్లు చెప్పారు. ఈ పరీక్షల తేదీలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్, స్టడీ సెంటర్లలో సంప్రదించాలని సూచించారు.

Similar News

News July 11, 2025

HYD: అన్నా.. OUలో నోటిఫికేషన్ వస్తుందా?

image

‘అన్నా.. మన ఓయూలో డిగ్రీ, పీజీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను అధికారులు మరచిపోయినట్టున్నారు’ అని విద్యార్థులు చర్చించుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరానికి ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు. అంబేడ్కర్, IGNO వర్సిటీలు నోటిఫికేషన్ విడుదల చేసి అడ్మిషన్లు ప్రారంభించాయి. ఓయూ అధికారులు మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయడంలేదు. ఇప్పటికైనా నోటిఫికేషన్ విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు.

News July 11, 2025

GHMCకి మీడియాకు వారానికోసారి ఎంట్రీ?

image

జర్నలిస్టులు ఇక ఎప్పుడు పడితే అప్పుడు GHMC ప్రధాన కార్యాలయంలోకి వెళ్లడానికి వీలుపడకపోవచ్చు. రెగ్యులర్ జర్నలిస్టులతో పాటు యూట్యూబ్ ఛానళ్ల వారు నిత్యం అధికారులను కలిసేందుకు వస్తున్నారని, దీంతో విధినిర్వహణకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. అందుకే అక్రిడిటేషన్ ఉన్న వారిని మాత్రమే వారానికి ఒకసారి అనుమతించాలని నిర్ణయించినట్లు సమాచారం.

News July 11, 2025

HYD: మాయం కానున్న ఆ మూడు పార్టీలు!

image

తెలంగాణలో మూడు పార్టీలు మాయం కానున్నాయి. అన్ రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ పార్టీలైన ఏపీ రాష్ట్ర సమైక్య సమితి పార్టీ, జాతీయ మహిళా పార్టీ, యువ తెలంగాణ పార్టీలు రాష్ట్రంలో 2019 నుంచి లోక్‌సభ, అసెంబ్లీ, ఉపఎన్నికల్లో పోటీచేయలేదు. దీంతో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఆయా పార్టీలకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తొలగింపు ప్రతిపాదనకు నోటీసులు పంపించారు.