News July 10, 2025
సికింద్రాబాద్: 2,500 మంది పోలీసులతో బందోబస్తు

ఆదివారం ఉజ్జయిని మహాకాళి బోనాల జాతరకు 2,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు నార్త్ జోన్ DCP రష్మీ పెరుమాళ్ వెల్లడించారు. ఆలయ ఆవరణలో ఈ రోజు జాతర కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. భక్తుల సందర్శనకు 6 క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జాతర రోజు మ.1 నుంచి 3 గంటల మధ్య శివసత్తులకు ప్రత్యేక దర్శనం ఉంటుందన్నారు. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్‌కు ప్రత్యేక క్యూలైన్లు ఉంటాయన్నారు.
Similar News
News July 11, 2025
HYD: అన్నా.. OUలో నోటిఫికేషన్ వస్తుందా?

‘అన్నా.. మన ఓయూలో డిగ్రీ, పీజీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను అధికారులు మరచిపోయినట్టున్నారు’ అని విద్యార్థులు చర్చించుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరానికి ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు. అంబేడ్కర్, IGNO వర్సిటీలు నోటిఫికేషన్ విడుదల చేసి అడ్మిషన్లు ప్రారంభించాయి. ఓయూ అధికారులు మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయడంలేదు. ఇప్పటికైనా నోటిఫికేషన్ విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు.
News July 11, 2025
GHMCకి మీడియాకు వారానికోసారి ఎంట్రీ?

జర్నలిస్టులు ఇక ఎప్పుడు పడితే అప్పుడు GHMC ప్రధాన కార్యాలయంలోకి వెళ్లడానికి వీలుపడకపోవచ్చు. రెగ్యులర్ జర్నలిస్టులతో పాటు యూట్యూబ్ ఛానళ్ల వారు నిత్యం అధికారులను కలిసేందుకు వస్తున్నారని, దీంతో విధినిర్వహణకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. అందుకే అక్రిడిటేషన్ ఉన్న వారిని మాత్రమే వారానికి ఒకసారి అనుమతించాలని నిర్ణయించినట్లు సమాచారం.
News July 11, 2025
HYD: మాయం కానున్న ఆ మూడు పార్టీలు!

తెలంగాణలో మూడు పార్టీలు మాయం కానున్నాయి. అన్ రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ పార్టీలైన ఏపీ రాష్ట్ర సమైక్య సమితి పార్టీ, జాతీయ మహిళా పార్టీ, యువ తెలంగాణ పార్టీలు రాష్ట్రంలో 2019 నుంచి లోక్‌సభ, అసెంబ్లీ, ఉపఎన్నికల్లో పోటీచేయలేదు. దీంతో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఆయా పార్టీలకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తొలగింపు ప్రతిపాదనకు నోటీసులు పంపించారు.