News July 10, 2025

భీమడోలులో అనుమానస్పదంగా బాలిక మృతి

image

భీమడోలు గురుకుల కళశాలలో ఓ బాలిక అనుమానస్పదంగా మృతి చెందింది. వసతి గృహంలో గురువారం సాయంత్రం విగతజీవిగా పడి ఉండడంతో నిర్వహకులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యలు మృతి చెందినట్లు చెప్పారు. ఈ చిన్నారి భీమడోలు మండలం అర్జవారిగూడెం గ్రామానికి చెందిన విద్యార్థిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Similar News

News July 11, 2025

శ్రీశైలం నీళ్లు ఎలా వాడుకుంటారో తెలుసా?

image

శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమ, తెలంగాణకు నీరందుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44వేల క్యూసెక్కులను రాయలసీమకు తరలించొచ్చు. తెలుగు గంగ, గాలేరు-నగరి కాలువల ద్వారా కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు నీరందుతోంది. హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకంతో అనంతపురం, చిత్తూరుకు నీరు వెళ్తోంది. అటు తెలంగాణ కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా లబ్ధి పొందుతోంది.

News July 11, 2025

VJA: విచ్చలవిడిగా రూ.35 కోట్ల దుబారా..చివరికి.!

image

అద్విక ట్రేడింగ్ కంపెనీ నిర్వాహకుడు ఆదిత్య కేసు దర్యాప్తులో పోలీసులు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి తెస్తున్నారు. డిపాజిటర్లను ఆకర్షించేందుకు రూ.35 కోట్లకుపైగా పలు ఉత్సవాలు, పుట్టినరోజు వేడుకలు, ఖరీదైన హోటల్ రూమ్‌లలో బస ఏర్పాట్లు, టూర్‌లను కంపెనీ నిర్వాహకులు చేపట్టినట్లు తెలుస్తోంది. 11 మంది కంపెనీ డైరెక్టర్‌లకు విల్లాలు కట్టడానికి ప్రణాళిక సిద్ధం చేయగా దివాళా తీయడంతో ముందుకెళ్లలేదు.

News July 11, 2025

BJP రామచంద్రా.. భద్రాద్రిని కాపాడండి: కేటీఆర్

image

AP రాష్ట్రం పురుషోత్తపట్నంలో ఉన్న భద్రాచలం రాములోరి భూములను ఆక్రమించుకుంటుంటే BJP రామచంద్రా నోరు తెరవరేం అని BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును మాజీ మంత్రి కేటీఆర్ పరోక్షంగా విమర్శించారు. తమ భాగస్వామ్య ప్రభుత్వం చేరలో ఉన్నామని వదిలేస్తున్నారా అని మండిపడ్డారు. ప్రధాని మోదీతో మాట్లాడతారో లేదా మీ దోస్తు(చంద్రబాబు నాయుడు) దగ్గర మోకరిల్లుతారో మీ ఇష్టం.. ఆక్రమణల చెర నుంచి విడిపించాలని డిమాండ్ చేశారు.