News March 30, 2024

కామారెడ్డి: ఏప్రిల్ 4న ప్రొఫెసర్ పోస్టులకు ఇంటర్వ్యూలు

image

కామారెడ్డి మెడికల్ కాలేజీలో 4 ప్రొఫెసర్, 13 అసిస్టెంట్ ప్రొఫెసర్, 5 సీనియర్ రెసిడెంట్ హానర్ ఓరియన్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులకు ఏప్రిల్ 4న ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.

Similar News

News September 9, 2025

NZB: చేపలు పట్టేందుకు వెళ్లి.. చెరువులో పడి మృతి

image

సిరికొండ మండలం కొండాపూర్ గోప్య తండా పరిధిలోని గంటతాండలో విషాదం నెలకొంది. చేపలు పట్టేందుకు చెరువుకు వెళ్లిన శంకర్ (60) చెరువులో పడి మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్ చేపల వేటకు వెళ్లాడు. చాలా సేపటి వరకు తిరిగి రాకపోవడంతో వెతకగా, అతని మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించి మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News September 9, 2025

శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు 8 గేట్ల ద్వారా నీటి విడుదల

image

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 54,545 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. 8 వరద గేట్ల ద్వారా 25000 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్ట్ అధికారులు దిగువకు వదులుతున్నారు. IFFC 19,000, కాకతీయ 5,500, ఎస్కేప్ 2,500, సరస్వతి 800, లక్ష్మి 200, అలీసాగర్ 360, గుత్ప 270, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని కేటాయిస్తున్నారు. ప్రాజెక్టులో 1091 అడుగులకు నీటిమట్టం చేరుకోగా 80.501 TMC నీరుంది.

News September 9, 2025

NZB: మూడేళ్ల చిన్నారికి అరుదైన చికిత్స

image

NZBలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో మూడేళ్ల చిన్నారికి అరుదైన గుండె ప్రొసీజర్ విజయవంతమైంది. పుట్టిన వెంటనే సహజంగా మూసుకుపోవాల్సిన రక్తనాళం తెరుచుకొని ఉండటంతో చిన్నారి తీవ్ర సమస్యలు ఎదుర్కొంది. ఈ క్రమంలో వైద్యులు శస్త్రచికిత్స చేయకుండా ప్రత్యేక గుండె ప్రొసీజర్ ద్వారా రంద్రం మూసేసినట్లు Dr. సందీప్ రావు, సదానంద రెడ్డి ప్రకటించారు. చిన్నారికి సకాలంలో సరైన చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పిందని తెలిపారు.