News July 10, 2025
విజయసాయి రెడ్డికి మరోసారి సిట్ నోటీసులు

AP: లిక్కర్ స్కాం కేసులో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి సిట్ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 12న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని అందులో పేర్కొంది. కాగా ఈ కేసులో ఇప్పటికే విజయసాయి ఒకసారి విచారణకు హాజరయ్యారు.
Similar News
News August 31, 2025
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న నారా రోహిత్

అక్టోబర్ లేదా నవంబర్‌లో తాను వివాహం చేసుకోనున్నట్లు టాలీవుడ్ హీరో నారా రోహిత్ తెలిపారు. ‘ప్రతినిధి 2’ హీరోయిన్ శిరీషను తాను పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పారు. కాగా ఇప్పటికే వీరిద్దరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో వీరిద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. రోహిత్ నటించిన ‘సుందరకాండ’ మూవీ ఇటీవలే విడుదలైంది.
News August 31, 2025
నీరు లేని చోటు నుంచి ఉన్న చోటుకు మార్చాం: హరీశ్ రావు

TG: తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజీని మార్చడం సొంత నిర్ణయం కాదని, క్యాబినెట్‌లో చర్చించామని హరీశ్ రావు అసెంబ్లీలో పేర్కొన్నారు. ‘నీరు లేని చోటు నుంచి ఉన్న చోటుకు మార్చాం. 2009-14 వరకు మీరే అధికారంలో ఉన్నారు కదా.. తుమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు తీయలేదు? ప్రజాధనాన్ని ఎక్కడా దుర్వినియోగం చేయలేదు. ఆంధ్రా పాలనలో అన్యాయం జరిగింది కాబట్టే కాళేశ్వరం నిర్మించాం’ అని తెలిపారు.
News August 31, 2025
దోపిడీ చేసేందుకే ప్రాజెక్టు స్థలాన్ని మార్చారు: రేవంత్

TG: తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు అందుబాటులో ఉన్నాయని 2009, 14లో కేంద్రం చెప్పినా దోపిడీ చేసేందుకు ప్రాజెక్టు స్థలాన్ని మార్చారని సీఎం రేవంత్ ఫైరయ్యారు. ‘ఆ విషయం దాచి 2015లో ఉమా భారతి లేఖను పట్టుకుని హరీశ్ తప్పుదోవ పట్టిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టొద్దని ఎప్పుడూ చెప్పలేదు. ఎత్తు తగ్గించుకోవాలని మాత్రమే వాళ్లు సూచించారు’ అని అసెంబ్లీలో తెలిపారు.